‘పద్మావతి’ కావాలంటున్న సింధూ

news18india
Updated: June 7, 2018, 5:22 PM IST
‘పద్మావతి’ కావాలంటున్న సింధూ
  • Share this:

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. టాలీవుడ్లో ఇప్పటికే సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందిన ‘మహానటి’ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రాముడి బయోపిక్ తెరకెక్కించాలని, ఆయన కుమారుడు నందమూరి బాల‌కృష్ణ‌ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇవే కాకుండా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, పుల్లెల గోపిచంద్, కత్తి కాంతారావు వంటి ప్రముఖుల జీవితాలపై కూడా సినిమాలు రూపొందబోతున్నాయి. అయితే ఈ బయోపిక్ ట్రెండ్ మొదట బాలీవుడ్లోనే మొదలైంది.


క్రీడాకారులైన మేరీకోమ్, ఎమ్.ఎస్. ధోనీ, సచిన్, దివంగత నటి సిల్క్ స్మిత జీవితాలపై బాలీవుడ్లో సినిమాలు రూపొందాయి. మంచి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు సీనియర్ నటుడు సంజయ్ దత్త్ జీవితంపై కూడా ‘సంజూ’సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. త్వరలో తెలుగు తేజం, బ్యాట్మింటన్ స్టార్ సింధూ బయోపిక్ కూడా తెరకెక్కనుంది.

Deepika padukone
Deepika padukone


‘అరుంధతి’ సినిమాలో పశుపతిగా నటించి, తెలుగువారందరినీ భయపెట్టిన సోనూసూద్, ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నాడు. చాలారోజులుగా తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసిన సోనూసూద్, బాలీవుడ్లో మాత్రం తెగ బిజీగా గడుపుతున్నాడు. అక్కడ హీరోగా మారి ఓ సినిమా కూడా చేసిన ఈ స్టైలిష్ విలన్ ఇప్పుడు నిర్మాతగా నిరూపించుకోవాలని తెగ తాపత్రయపడుతున్నాడు. గత ఒలింపిక్స్ లో దేశానికి రజత పతకం తెచ్చిన తెలుగమ్మాయి పీవీ సింధు జీవితం తెరకెక్కించాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడింది పీవీ సింధు.

కొద్దికాలం క్రితమే సోనూసూద్ గారిని కలిశాను. నా జీవితంలో జరిగిన చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారాయన. నా జీవితంపై బయోపిక్ రూపొందబోతుందనే ఆలోచన చాలా సంతోషాన్నిస్తోంది. తెర మీద నా పాత్ర దీపికా పదుకొనె చేస్తే బాగుంటుంది. ‘బాజీరావ్ మస్తానీ’, ‘రామ్ లీలా’, ‘పద్మావతి’ వంటి చాలా చిత్రాల్లో దీపికా చాలా బాగా చేసింది. ఆమె నటనంటే నాకెంతో ఇష్టం. అయితే ఇది నా సలహా మాత్రమే. సినిమాలో ఎవరు నా పాత్ర చేయాలనేది నిర్మాతల ఇష్టం...
- సింధు 

PV Sindhu Biopic
pv sindhu


అయితే ప్రస్తుతం ‘పద్మావతి’ దీపికా పదుకొనె, పెళ్లి పనుల్లో బిజీగా ఉందనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ కుర్ర హీరో రణ్ వీర్ సింగ్ తో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సింధు బయోపిక్తో పాటు ఆమె స్నేహితురాలు, బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా రూపొందుతోంది. ఇందులో శ్రద్ధా కపూర్ సైనా పాత్ర పోషిస్తోంది.
Published by: Ramu Chinthakindhi
First published: June 7, 2018, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading