SIN WEB SERIES TRAILER RELEASED AND IT IS ON ALLU ARAVIND AHA ORIGINALS PK
అల్లు అరవింద్ అడల్ట్ వెబ్ సిరీస్.. మస్త్ మస్త్ మసాలా..
అల్లు అరవింద్ సిన్ వెబ్ సిరీస్ (allu aravind sin web series)
SIN trailer: తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు అడల్ట్ సినిమాల జోరు పెరిగిపోయింది. బోల్డ్ నెస్ పేరుతో ఇష్టమొచ్చినట్లు తీస్తున్నారంటూ ఇప్పటికే విమర్శలు కూడా మొదలయ్యాయి.
తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు అడల్ట్ సినిమాల జోరు పెరిగిపోయింది. బోల్డ్ నెస్ పేరుతో ఇష్టమొచ్చినట్లు తీస్తున్నారంటూ ఇప్పటికే విమర్శలు కూడా మొదలయ్యాయి. అయినా కూడా మన దర్శక నిర్మాతల చూపు అటు వైపు పడుతుంది. దానికి తోడు వెబ్ సిరీస్‌లు కూడా అలాగే వస్తున్నాయి. హాట్ వెబ్ సిరీస్‌లు తెలుగులో తక్కువే కానీ హిందీలో మాత్రం చాలానే వస్తున్నాయి. అక్కడ ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా వెబ్ సిరీస్ నిర్మాణం వైపు అడుగులేస్తున్నారు నిర్మాతలు. అందులో అల్లు అరవింద్ కూడా ముందున్నాడని తెలుస్తుంది.
అల్లు అరవింద్ సిన్ వెబ్ సిరీస్ (allu aravind sin web series)
ఈయన ఏకంగా ఓ అడల్ట్ వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడు. సిన్ పేరుతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆహా ఒరిజినల్స్‌లో వస్తుంది. అల్లు అరవింద్ మొదలుపెట్టిన ఓటిటి ఇది. ఇందులో జాగ్వార్ ఫేమ్ దీప్తి సోథితో పాటు జార్జ్ రెడ్డి ఫేమ్ తిరువర్ నటించారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. బూతుకు అమ్మ మొగుడులా ఉంది ఈ ట్రైలర్. కథ విషయానికొస్తే భార్యకు సెక్స్ అంటే సిగ్గు.. భర్తకు మాత్రం ఎప్పుడూ అదే కోరిక.. ఇదే కథను అల్లుకున్నాడు దర్శకుడు నవీన్ మేడారం. భార్య వద్దు అంటే.. మొగుడు మాత్రం అదే పనిలో ఉంటాడు. భార్య ఇష్టాయిష్టాలతో పని లేకుండా.. బలవంతంగా భార్య శరీరాన్ని అనుభవిస్తుంటాడు.
అదే సమయంలో ఈ భార్య భర్తల మధ్యలోకి మరో కత్తిలాంటి అమ్మాయి వస్తుంది. ఆమె హీరోను ప్రేమిస్తుంది.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. అల్లు అరవింద్ ప్లాట్ ఫామ్‌లో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మించాడు. మొత్తం అడల్ట్ కంటెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఈ కథలో. అమ్మాయిలకు మనసు ఉంటుందని.. దాంతో ఆడుకోవద్దని చెప్పే వెబ్ సిరీస్ ఇది. అయితే దీన్ని కాస్త బోల్డ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు నవీన్. ఈయన గతంలో అవసరాల శ్రీనివాస్‌తో బాబు బాగా బిజీ తెరకెక్కించాడు. ఏదేమైనా అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాత నుంచి ఇలాంటి హాట్ వెబ్ సిరీస్ రావడంతో అంతా సంచలనంగా మారుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.