రోడ్డెక్కిన రణ్‌వీర్ సింగ్.. కంట్రోల్ చేయలేకపోయిన పోలీసులు..

అదేంటి.. రణ్‌వీర్ సింగ్ ఎందుకు రోడ్డెక్కాడు.. ఆయనకేంటి అవసరం అనుకుంటున్నారా..? అంతేకదా మరి.. ఈ రోజుల్లో సినిమా చేయడం కంటే దాన్ని అమ్ముకోవడం పెద్ద విషయం. ఎలా తీసాం అనేది కాదు.. ఎలా దాన్ని ప్రమోట్ చేసుకున్నాం.. ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాం అనేది ఇక్కడ విషయం. ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు రణ్‌వీర్ సింగ్. అందుకే ‘సింబా’ సినిమా కోసం రోడ్డెక్కాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 29, 2018, 5:10 PM IST
రోడ్డెక్కిన రణ్‌వీర్ సింగ్.. కంట్రోల్ చేయలేకపోయిన పోలీసులు..
‘సింబా’లో రణ్‌వీర్ సింగ్
  • Share this:
ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత క‌ష్ట‌మో.. దాన్ని ప్రమోట్ చేసుకోవడం అంత‌కంటే కష్టం. ఈ ట్రిక్ తెలియ‌కే చాలా మంది హీరోలు చేజేతులా ఫ్లాపులు కొనితెచ్చుకుంటున్నారు. కానీ బాలీవుడ్లో మాత్రం ప్రమోషన్ ఓ రేంజ్లో ఉంటుంది. వాళ్లు చేసిన సినిమా ఎలా ఉన్నా కూడా ప్రమోషన్ మాత్రం మరో స్థాయిలో చేసుకుంటారు బాలీవుడ్ హీరోలు. వాళ్ళకు సిగ్గు పడటం అనే మాట అసలే తెలియదు. అస‌లు దాంతో ప‌రిచ‌యం కూడా ఉండ‌దు. త‌మ సినిమాల‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ల‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మే అంటారు.

Simmba Promotion.. Ranveer Singh Dances at galaxy theatre, Mumbai.. అదేంటి.. రణ్‌వీర్ సింగ్ ఎందుకు రోడ్డెక్కాడు.. ఆయనకేంటి అవసరం అనుకుంటున్నారా..? అంతేకదా మరి.. ఈ రోజుల్లో సినిమా చేయడం కంటే దాన్ని అమ్ముకోవడం పెద్ద విషయం. ఎలా తీసాం అనేది కాదు.. ఎలా దాన్ని ప్రమోట్ చేసుకున్నాం.. ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాం అనేది ఇక్కడ విషయం. ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు రణ్‌వీర్ సింగ్. అందుకే ‘సింబా’ సినిమా కోసం రోడ్డెక్కాడు. ranveer singh dance at galaxy theatre,,simmba review,simmba review in hindi,simmba box office collection,simmba box office collection worldwide,simmba movie promotion,simmba movie dance,hindi cinema,రణ్‌వీర్ సింగ్ డాన్స్,రణ్‌వీర్ సింగ్ డాన్స్ గెలాక్సీ థియేటర్,రణ్‌వీర్ సింగ్ డాన్స్ గెలాక్సీ థియేటర్ ముంబై,రణ్‌వీర్ సింగ్ డాన్స్ సింబా మూవీ,రణ్‌వీర్ సింగ్ సింబా సినిమా ప్రమోషన్,హిందీ సినిమా,టెంపర్ రీమేక్ సింబా సినిమా
సింబా పోస్టర్స్


తమ సినిమాను అలా చేసుకుంటారు వాళ్లు. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ కూడా అదే చేశాడు. ఈయ‌న న‌టించిన ‘సింబా’ సినిమా డిసెంబర్ 28న విడుదలైంది. దీనికి మంచి టాక్ వచ్చింది. ఇక ప్రేక్ష‌కులు చూసుకుంటారులే అని వ‌దిలేయ‌లేదు ఈ కుర్ర హీరో. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ మసాలా ఎంటర్టైనర్ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. ‘టెంపర్’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన సినిమా మంచి విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో రణ్‌వీర్ సింగ్ తన సినిమా ప్రమోషన్ ను మరింత కొత్తగా చేశాడు.

ముంబైలోని గెలాక్సీ థియేటర్ దగ్గర డాన్సులు చేశాడు ఈ హీరో. థియేటర్ లాన్‌లో నిలబడి డాన్సులు చేస్తూ.. పాటలు పాడి అభిమానులను అలరించాడు. ఇది కూడా ఓ రకంగా సినిమా ప్రమోషనే. బాలీవుడ్ లో రణ్‌వీర్ సింగ్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. ఇంత క్రేజ్ ఉండి కూడా తన సినిమాల‌ను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఇంకా కష్ట పడుతున్నాడు ఈ కుర్రహీరో.



ఈ ప్రమోషన్ చూసి మిగిలిన హీరోలు కూడా ఆశ్చర్య పోతున్నారు. ఇంత స్టార్ హీరో అయి ఉండి కూడా రోడ్లమీద డాన్సులు చేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ తన సినిమా కోసం చేశాడు రణ్ వీర్ సింగ్. మొత్తానికి ఈ హీరో చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ‌రి ఇలాంటి ప్రమోషన్ మన హీరోల నుంచి ఎప్పటికీ ఊహించొచ్చో.. అస‌లు ఊహించ‌గ‌ల‌మా..?

దీపిక పదుకొనే హాట్ ఫోటోస్..


ఇవి కూడా చదవండి..

2018కి రుణ‌ప‌డిపోయిన రామ్ చ‌ర‌ణ్.. మ‌హేష్.. ఎన్టీఆర్..


ప‌వ‌న్‌ను కొట్టేసాడు.. కానీ ఎన్టీఆర్‌ ముందు ఓడిన రామ్ చ‌ర‌ణ్..


గెట్ రెడీ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ నెక్ట్స్ ఏంటో చెప్పేది ఆ రోజే..

Published by: Praveen Kumar Vadla
First published: December 29, 2018, 4:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading