దీప్‌వీర్ పెళ్లిపై వివాదం : వివాహంలో సిక్కు సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపణ

శుభమా అంటూ ఒకింటివాళ్లు అయిన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేల పెళ్లిపై అపుడే వివాదం మొదలైంది. ఐతే సింధీ సంప్రదాయంలో పెళ్లి సందర్భంగా నిర్వహించే ‘ఆనంద్ కరాజ్’ కార్యక్రమం సిక్కు సంప్రదాయానికి విరుద్ధంగా జరిగిందని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ ఆరోపించింది.

news18-telugu
Updated: November 20, 2018, 9:50 AM IST
దీప్‌వీర్ పెళ్లిపై వివాదం : వివాహంలో సిక్కు సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపణ
దీప్‌వీర్ పెళ్లి
  • Share this:
శుభమా అంటూ ఒకింటివాళ్లు అయిన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేల పెళ్లిపై అపుడే వివాదం మొదలైంది. ఈ నెల 14, 15 తేదిల్లో ఇటలీలోని లేక్‌కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లో వీరిద్దిరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 14వ తేదిన కొంకణి సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది.

మరోవైపు 15వ తేదిన సింధీ సంప్రదాయంలో దీప్‌వీర్‌లు మరోసారి ఒకటయ్యారు. ఈనెల 21న బెంగళూరులో, 28లో ముంబాయిలో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ విందుకు సినీ,రాజకీయ రంగాలకు చెందిన పలువురు అతిరథ మహారథులు హాజరుకానున్నట్టు సమాచారం.

ముంబై ఎయిర్‌పోర్టులో దీపికా, రణవీర్


ఐతే సింధీ సంప్రదాయంలో పెళ్లి సందర్భంగా నిర్వహించే ‘ఆనంద్ కరాజ్’ కార్యక్రమం సిక్కు సంప్రదాయానికి విరుద్ధంగా జరిగిందని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. సిక్కుల పవిత్ర మత గ్రంథమైన ‘గురుగ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదన్న నిబంధనను వారు ఉల్లంఘించారని వారు పేర్కొన్నారు.

సింధీ సంప్రదాయంలో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే పెళ్లి ఫొటో


సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.దీనిపై ఫిర్యాదు చేసిన అనంతరం ఐదుగురు అత్యున్నత మత పెద్దలు ఈ విషయమై తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. మరీ ఈ విషయమై దీప్‌వీర్‌లు ఏరకంగా స్పందిస్తారో చూడాలి.
First published: November 20, 2018, 9:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading