SIIMA 2019 : సైమా అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటీనటులు వీరే..

సైమా 2019 వేడుకల్లో విజయ్ దేవరకొండ,సుకుమార్

సైమా అవార్డ్స్-2019 : రంగస్థలం సినిమాలో ఉత్తమ నటనకు గాను రాంచరణ్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడిగా గీతగోవిందం సినిమాకు గాను విజయ్ దేవరకొండకు అవార్డు దక్కింది.

  • Share this:
    ఖతార్‌లో జరుగుతున్న సైమా అవార్డ్స్-2019 వేడుకల్లో విజేతల పేర్లను ప్రకటించారు. అవార్డుల్లో తెలుగు కేటగిరీ నుంచి ఉత్తమ చిత్రంగా వైజయంతి ఫిలింస్ నిర్మించిన 'మహానటి' ఎంపికైంది. ఉత్తమ దర్శకుడి అవార్డు రంగస్థలం సినిమాకు గాను సుకుమార్‌కు దక్కింది. రంగస్థలం సినిమాలో ఉత్తమ నటనకు గాను రాంచరణ్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడిగా  గీతగోవిందం సినిమాకు గాను విజయ్ దేవరకొండకు అవార్డు దక్కింది.

    సైమా అవార్డ్స్-2019 అవార్డుల వివరాలు :

    ఉత్తమ నటి-కీర్తి సురేష్(మహానటి)
    విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి-సమంత(రంగస్థలం)
    ఉత్తమ సహాయ నటి-అనసూయ(రంగస్థలం)
    ఉత్తమ సహాయ నటుడు-రాజేంద్రప్రసాద్(మహానటి)

    ఉత్తమ హాస్యనటుడు-సత్య(ఛలో)
    ఉత్తమ విలన్-శరత్ కుమార్(నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా)
    ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్-దేవిశ్రీప్రసాద్(రంగస్థలం)
    ఉత్తమ గేయరచయిత-చంద్రబోస్(ఎంత సక్కగున్నావే-రంగస్థలం)

    ఉత్తమ నేపథ్య గాయని-అనురాగ్ కులకర్ణి(RX100)
    ఉత్తమ ఆరంగేట్ర నటుడు-కల్యాణ్ దేవ్(విజేత)
    ఉత్తమ ఆరంగేట్ర నటి-పాయల్ రాజ్‌పుత్(RX100)

    ఉత్తమ ఆరంగేట్ర దర్శకుడు-అజయ్ భూపతి(RX100)
    ఉత్తమ సినిమాటోగ్రాఫర్-రత్నవేలు(రంగస్థలం)
    ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్-రామకృష్ణ(రంగస్థలం)
    సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ -విజయ్ దేవరకొండ
    Published by:Srinivas Mittapalli
    First published: