హోమ్ /వార్తలు /సినిమా /

SIIMA Awards 2019: 'సైమా' అవార్డ్స్ 2019 విజేతలు.. ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ నటిగా ఎవరంటే?

SIIMA Awards 2019: 'సైమా' అవార్డ్స్ 2019 విజేతలు.. ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ నటిగా ఎవరంటే?

SIIMA Awards 2019: ఒక సినిమాకు గుర్తింపు ప్రేక్షకుల నుండి వస్తుంది. అందులో నటించే నటినటులు, దర్శకులు, నిర్మాతలు, సింగర్స్, నిర్మాణ సంస్థలు, గాయకులు, ఇలా సినిమాకు అందించే అందరి అభిరుచులు నచ్చితేనే సినిమాకు మంచి సక్సెస్ వస్తుంది.

  SIIMA Awards 2019: ఒక సినిమాకు గుర్తింపు ప్రేక్షకుల నుండి వస్తుంది. అందులో నటించే నటినటులు, దర్శకులు, నిర్మాతలు, సింగర్స్, నిర్మాణ సంస్థలు, గాయకులు, ఇలా సినిమాకు అందించే అందరి అభిరుచులు నచ్చితేనే సినిమాకు మంచి సక్సెస్ వస్తుంది. కొన్ని కొన్ని సినిమాలు హిట్ కాకున్నా కూడా అందులో నటించిన నటుల పాత్రలకు, సింగర్ లకు కూడా గుర్తింపులు వస్తుంటాయి. ఇక వాటిని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు గుర్తించేలా వారికి పలు అవార్డులను అందిస్తుంటారు.

  తమ తమ ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళు తమ తమ అవార్డ్ ఫంక్షన్ లను నిర్వహిస్తూ ఉంటారు. ఇక త్వరలోనే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ( సైమా) వేడుక ప్రారంభం కానుంది. ఇందులో కేవలం అవార్డులను అందజేయడమే కాకుండా పలురకాల సందడిలను కూడా చేయిస్తుంటారు. ముఖ్యంగా డాన్స్ పర్ఫార్మెన్స్ లు లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే గత రెండు సంవత్సరాల నుండి ఈ అవార్డ్ ఫంక్షన్స్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఈ సంవత్సరం ఎలాగైనా ఈ వేడుకను చేయడానికి ముందుకు వచ్చారు.

  ఇక ఈ ఏడాది ఈ అవార్డ్ ఫంక్షన్ ను వైభవంగా జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే 2019 సంవత్సరానికి సంబంధించిన విజేతల వివరాలు తాజాగా వెలువడ్డాయి. అందులో ఉత్తమ చిత్రంగా జెర్సీ సినిమా అవార్డు అందుకుంది. ఉత్తమ వినోదాత్మక సినిమాగా ఎఫ్ 2 అవార్డు సొంతం చేసుకుంది. మహర్షి సినిమాకు ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి, ఉత్తమ నటుడిగా మహేష్ బాబులు విజేతలుగా నిలిచారు.

  జెర్సీ సినిమాకు ఉత్తమ నటుడిగా నాని గెలిచాడు. ఓ బేబీ సినిమాకు సమంత ఉత్తమ నటి, డియర్ కామ్రేడ్ కు ఉత్తమ నటిగా రష్మిక మందనలు విజేతలుగా నిలిచారు. ఇక మహర్షి సినిమాలో అల్లరి నరేష్ ఉత్తమ సహాయ నటుడిగా , ఓ బేబీ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా లక్ష్మీ గెలుపొందారు. ఇక మహర్షి సినిమాకు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, గేయ రచయితగా శ్రీమణి లు విజేతలుగా నిలిచారు. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ కు అనురాగ్ కులకర్ణి గెలుపొందాడు. మజిలీ సినిమాకు ప్రియతమా పాటను పాడిన చిన్మయికి ఈ అవార్డు అందనుంది.

  SIIMA Awards 2019, mahesh babu, samantha akkineni, jersy, f2, vamsi paidypalli, rashmik mandanna, allari naresh, devi sri prasad
  SIIMA Awards

  గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉత్తమ విలన్ గా కార్తికేయ గుమ్మకొండ విజేతగా నిలిచాడు. మత్తు వదలరా సినిమాకు తొలి పరిచయం హీరోగా శ్రీ సింహ, దొరసాని సినిమాకు తొలి పరిచయం హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు తొలి పరిచయ దర్శకుడు స్వరూప్ ఆర్.ఎన్.జె లు ఈ గుర్తింపును అందుకోనున్నారు. ఇక మల్లేశం సినిమాకు తొలి పరిచయం నిర్మాత స్టూడియో 99, జెర్సీ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ సానూ వర్గిన్, రాజుగారి గది 3 లో ఉత్తమ కమెడియన్గా అజయ్ ఘోష్ ఈ అవార్డును అందుకోనున్నాడు.

  First published:

  Tags: Jersy, Mahesh Babu, Samantha akkineni, SIIMA Awards 2019

  ఉత్తమ కథలు