హోమ్ /వార్తలు /సినిమా /

దోస్తాన్ టీజర్ విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి

దోస్తాన్ టీజర్ విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి

Dosthan Teaser News 18

Dosthan Teaser News 18

Dhostan Teaser: సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "దోస్తాన్ ". విడుదలకు సిద్దమైన చిత్ర టీజర్ ను ఘనంగా విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సిద్ స్వరూప్ (Sidswaroop), కార్తికేయ (Karthikeya), ఇందు ప్రియ (Indu priya), ప్రియ వల్లబి (Priya Vallabhi) నటీనటులుగా శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "దోస్తాన్ ". విడుదలకు సిద్దమైన చిత్ర టీజర్ ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి చిత్ర టీజర్ లాంచ్ చేశారు. వీరితో పాటు నిర్మాత పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మూసా అలీ ఖాన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి మాట్లాడుతూ.. తరతరాలనుండి వస్తున్నదే ఫ్రెండ్ షిప్. ఇప్పుడు "దోస్తాన్' పేరుతో వస్తున్న ఈ చిత్ర టీజర్ బాగుంది.మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ ఆల్ ద బెస్ట్ తెలిపారు.

నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మాట్లాడుతూ.. కదిరిలో ఉన్న సూర్యనారాయణ గారు అన్నవరం లో ఉన్న హీరోతో వైజాగ్, రాజమండ్రి లలో విజయవంతంగా షూటింగ్ చేసుకొని "దోస్తాన్" అని మంచి టైటిల్ పెట్టారు.ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్రైలర్, టీజర్ ఇలా అన్నీ బాగున్నాయి.మంచి కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ..మంచి ప్లానింగ్ తో ఫ్రెండ్స్ టైటిల్ తో తీసిన "దోస్తాన్" సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు. నిర్మాత పద్మిని నాగులపల్లి మాట్లాడు తూ.. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ తో ఇంతకుముందు ప్రేమదేశం, ప్రేమసందేశం వంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఇద్దరు ఫ్రెండ్స్ తమకున్న వాటిని షేర్ చేసుకుంటూ ఎలా లీడ్ చేశారో అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ "దోస్తాన్" చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.' isDesktop="true" id="1490664" youtubeid="QQ5jwbkGAog" category="movies">

చిత్ర దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మ మాట్లాడుతూ..మా "దోస్తాన్" చిత్ర టీజర్ ను విడుదల చేసిన పెద్దలకు ధన్యవాదాలు.నా భార్య కోరిక మేరకు నేను సినిమా తియ్యాలని ఎన్నో కథలు విన్నాను. అవేవి నాకు నచ్చలేదు.సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను.తుని, లంబసింగి, తలకోన, వరంగల్ , హైదరాబాద్ , వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే ఈ సినిమా పూర్తి చేయడానికి 96 రోజులు పట్టింది. ఇందులోని ఫైట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరో సిద్ స్వరూప్ మాట్లాడుతూ.. మా దోస్తాన్ చిత్ర టీజర్ ను విడుదల చేసిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు..చిన్నతనం లోని ఫ్రెండ్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెట్టిన దోస్తాన్ టైటిల్ తో వస్తున్న ఇది నా మొదటి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు