హోమ్ /వార్తలు /సినిమా /

షూటింగ్‌లో ప్రముఖ హీరోకు గాయం.. వదిన జాగ్రత్తగా చూసుకో అంటూ హీరోయిన్ పై కామెంట్లు

షూటింగ్‌లో ప్రముఖ హీరోకు గాయం.. వదిన జాగ్రత్తగా చూసుకో అంటూ హీరోయిన్ పై కామెంట్లు

సిద్ధార్థ మల్హోత్రా

సిద్ధార్థ మల్హోత్రా

షూటింగ్‌కు సంబంధించి యాక్షన్ సీన్స్ చేస్తుండగా.. అతని చేతికి చిన్న గాయం అయినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో నెటిజన్స్ సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.

  బాలీవుడ్ యంగ్ హీరోలలో సిద్ధార్థ మల్హోత్ర ఒకడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో హిట్ కొట్టాడు సిద్ధార్థ. ఆ తర్వాత వరుస సినిమాలు తీసుకుంటూ.. బిజీగా మారాడు.ఇటీవలే సిద్ధార్థ నటించిన షేర్షా మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అతడికి జోడిగా కియారా అద్వానీ నటించింది. వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అవ్వడంతో.. ఈ సినిమా షూటింగ్ నుంచి ఈ జంట డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ విషయం పక్కన పెడితే తాజాగా.. సిద్ధార్థ మల్హోత్రా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టితో కలిసి గోవాలో 'ఇండియన్ పోలీస్  గోవాలో యాక్షన్ సన్నివేశాలకు షూటింగ్ నిర్వహిస్తున్నారు. అయతే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు సిద్ధార్థ గాయపడ్డాడు. తన చేతికి గాయం అయినట్లు.. సెల్ఫీని తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ సెల్ఫీలో సిద్ధార్థ చేతికి గాయం అయినట్లు మనం చూడొచ్చు. "#RohitShetty యాక్షన్ హీరో నిజమైన చెమట, నిజమైన రక్తంతో సమానం! 🔥💪 రోహిత్ సార్ గోవాలో కొన్ని క్రేజీ యాక్షన్ సన్నివేశాలకు కెమెరా పని చేస్తున్నారు.. అంటూ సిద్ పోస్టు చేశాడు. అయితే సిద్ధార్థ పోస్టులపై నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాకు ఇంతకన్నా పెద్ద గాయాలే అయ్యాయి అంటున్నారు. చిన్నప్పుడు క్రికెట్ ఆడే సమయంలో నాకు ఇంత పెద్ద దెబ్బే తగిలింది అంటూ సిద్దుకు చురకలంటించాడు మరో నెటిజన్.

  ఇంకొకరు ఏడేళ్ల కిందట వచ్చిన హసీతో ఫసీ సినిమాలో ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అంతే గ్లామర్‌గా ఉన్నావు అంటూ.. సిద్ధు అందాన్ని పొగిడేస్తున్నారు. మరికొందరు గాయం అయితే కెమెరాల ముందు కాదు... డాక్టర్ల ముందు చూపించాలని సెటైర్లు వేస్తున్నారు. మరో నెటిజన్ ఇంత చిన్న దెబ్బ ఐదేళ్ల పిల్లాడికి కూడా తగులుతుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. కియారా అద్వానీని ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు, అతన్ని జాగ్రత్తగా చూసుకో వదిన అంటూ పోస్టు చేశాడు.దీంతో ఇప్పుడు సిద్ధార్థ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. మరి కియారా అద్వానీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

  మరోవైపు, రోహిత్ శెట్టి కూడా ట్విట్టర్లో తనకు సంబంధించిన ఓ యాక్షన్‌ ఫోటోను పోస్ట్ చేశాడు. చేతిలో భారీ కెమెరాతో బోటుపై పడుకున్న ఫోటోను షేర్ చేశాడు. "గోవా...యాక్షన్ మోడ్!!! ఇండియన్ పోలీస్ ఫోర్స్ 🇮🇳" అని పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ పై అంచనాలు పెరుగుతున్నాయి. భారీ యాక్షన్ సీన్స్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు అభిమానులు అంచనా వేస్తున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Bollywood, Kiara advani, Sidharth Malhotra

  ఉత్తమ కథలు