హోమ్ /వార్తలు /సినిమా /

Break Up: మరో సినీ జంట బ్రేకప్.. పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా చేశారేంటి?

Break Up: మరో సినీ జంట బ్రేకప్.. పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా చేశారేంటి?

మరో బాలీవుడ్ జంట బ్రేకప్

మరో బాలీవుడ్ జంట బ్రేకప్

నిత్యం ప్రియుడితో బిజీగా ఉండే కియరా.. ఉన్నట్లుండి అతడికి దూరం అయ్యింది. తరచూ కలిసి ఆమె.. సిద్దార్థను గత కొన్నిరోజులుగా కలవలేదు.దీంతో వీరిద్దరూ తమ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

  చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగార్జున అమల,జీవితా రాజశేఖర్,శ్రీకాంత్ ఊహా... ఇలా తెలుగు సినిమాలో చాలామంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లాడారు. అయితే అలాగే చాలామంది ప్రేమలు.. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయాయి. ఇక బాలీవుడ్‌లో కూడా ఇలాంటి జంటలు ఎక్కువగానే ఉన్నాయి.అక్షయ్ కుమార్ ట్వింకుల్ ఖన్నా ప్రేమించి పెళ్లాడారు.అలనాటి నటి ధర్మేంద్ర హేమామాలినిలది కూడా ప్రేమ వివాహం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాంతాడంతా పెద్దదే అవుతోంది. అయితే ఇటీవల కాలంలో.. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోతుంటే.. మరికొన్ని జంటలు ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి.. పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోతున్నాయి. తాజాగా మరో సెలబ్రిటీ జంట తమకు ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. ఆ జంట ఇంకెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్ర, సెక్సీ హీరోయిన్ కియారా అద్వానీ.

  ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. అటు హిందీలో ఫుల్ బిజీగా మారింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీళ్ళు డేటింగ్ కూడా చేస్తున్నారు. ఇద్దరు కలిసి హోటల్స్,పార్టీలకు తిరిగారు. ‘షేర్షా’ సినిమాలో వీరిద్దరూ కలిసి తొలిసారి నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.


  ఇక అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు బాలీవుడ్ పార్టీలలో కలిసి వెళ్లేవారు. పలుసార్లు వీరిద్దరూ జంటగా మీడియాకి చిక్కారు. వీరి సన్నిహితులు కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే చెప్పారు. అయితే తాజాగా సిద్దార్థ్ – కియారా బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.దీనికి మరింత బలం చేకూర్చేలా సిద్ధార్థ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు కూడా ఉండటం విశేషం. ‘ఏ డే విత్ అవుట్ సన్ షైన్ లైక్, యూ నో..నైట్’ అంటూ సిద్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై చాలామంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

  సిద్దార్థ చేసిన తాజా పోస్టుతో సిద్ కియరా ప్రేమకు ఎండ్ కార్డ్ పడినట్లేనా అని అంతా చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఈ ఇద్దరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు కియార తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలో కనిపించింది.  సిద్దార్థ కియరాకు ముందు ఆలియా భట్,జాక్వలీన్‌తో కూడా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Bollywood news, Kiara advani, Siddharth

  ఉత్తమ కథలు