హోమ్ /వార్తలు /సినిమా /

అరె! మంత్రి మల్లారెడ్డి ప్లాన్ బెడిసికొట్టిందే.. డీజే టిల్లుతో పెట్టుకుంటే అట్లుంటది మరి!!

అరె! మంత్రి మల్లారెడ్డి ప్లాన్ బెడిసికొట్టిందే.. డీజే టిల్లుతో పెట్టుకుంటే అట్లుంటది మరి!!

Photo Twitter

Photo Twitter

Malla Reddy: అనుభజ్ఞుల సలహాతో పక్కా ప్రణాళికలు రచిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో తన మార్క్ చూపించాలని స్కెచ్చేస్తున్నారట మంత్రి మల్లారెడ్డి. అయితే నిన్నగాక మొన్న డీజే టిల్లు DJ Tillu సినిమాలో తనదైన నటనతో యావత్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న యంగ్ హీరో హీరో సిద్ధు జొన్నలగడ్డతో ఆయన ఓ సినిమా చేయాలని ప్లాన్ చేయగా అది బెడిసికొట్టిందని సమాచారం.

ఇంకా చదవండి ...

సినిమాలు తీయాలి.. దర్శకనిర్మాతలుగా రాణించాలని ఎంతోమంది కలలు కంటుంటారు. అలాంటి కోరికనే మంత్రి మల్లారెడ్డికి (Minister Malla reddy) ఉంది. తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా సేవలందిస్తున్న ఆయన సినీ రంగంలో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అనుభజ్ఞుల సలహాతో పక్కా ప్రణాళికలు రచిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో తన మార్క్ చూపించాలని స్కెచ్చేస్తున్నారట. అయితే నిన్న గాక మొన్న డీజే టిల్లు (DJ Tillu) సినిమాలో తనదైన నటనతో యావత్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న యంగ్ హీరో హీరో సిద్ధు జొన్నలగడ్డతో (Siddu Jonnalagadda) ఆయన ఓ సినిమా చేయాలని ప్లాన్ చేయగా అది బెడిసికొట్టిందని సమాచారం. సిద్ధు జొన్నలగడ్డ ఆయనకు బిగ్ షాక్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఈ ఇష్యూకి సంబంధించిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మే 1వ తేదీన సినీ రంగ కార్మికులు మేడే ఉత్సవాలను చాలా గ్రాండ్‌గా నిర్వహించగా.. ఈ వేడుకలకు మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi), తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ వేదికపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో నేను వెబ్ సిరీస్, సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తానని అన్నారు. మీ కోసమో.. నా కోసమే కాదు.. కార్మికుల కోసం అని చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరంజీవి అన్న ఇప్పటి నుంచి నేను నీకు తోడవుతాను అని కూడా మాటిచ్చారు. ఈ క్రమంలోనే తన తొలి సినిమా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారట మంత్రి మల్లారెడ్డి.

అయితే రీసెంట్‌గా తనదైన మాస్ డైలాగ్స్‌తో డీజే టిల్లు రూపంలో ప్రేక్షకులకు కిక్కిచ్చిన సిద్ధు జొన్నలగడ్డతో తొలి సినిమా చేయాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా చేపట్టారట. అయితే మంత్రి చేసిన ఈ ఆలోచన బెడిసికొట్టిందని తెలుస్తోంది. తాను బిజీగా ఉన్నానని చెప్పి మంత్రి ఇచ్చిన ఆఫర్‌ని సింపుల్‌గా సిద్ధు జొన్నలగడ్డ తిరస్కరించారట. ఈ విషయం బయటకు రావడంతో జనాల్లో హాట్ టాపిక్ అయింది. Dj టిల్లుతో పెట్టుకుంటే అట్లుంటది మరి అంటూ ఈ వార్త చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ క్రేజీ హీరోగా మారాడు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ సినిమా సీన్స్ సిద్దు క్రేజ్ అమాంతం పెంచేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 12 విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా సిద్ధుకి ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆయన మల్లారెడ్డితో సినిమాకు నో చెప్పారట. సో.. చూడాలి మరి సిద్దు నో అన్నాడు కాబట్టి మల్లారెడ్డి ఏ హీరోని ఎంచుకుంటాడా అనేది!.

First published:

Tags: DJ Tillu Movie, Malla Reddy

ఉత్తమ కథలు