Siddharth - Saina Nehwal | గత కొన్ని రోజులుగా హీరో సిద్ధార్థ్ సినిమాలకంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈయన బాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై చేసిన వ్యాఖ్యలుకు క్షమాపణలు కోరారు.
Siddharth - Saina Nehwal | గత కొన్ని రోజులుగా హీరో సిద్ధార్థ్ సినిమాలకంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్గా జనవరి 5న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనపై ఇంటలిజెన్స్ వైఫల్యం.. పంజాబ్ రాష్ట్ర అలసత్వం పై సర్వత్రా దుమారం రేగుతోంది. ఈ విషయమై కేంద్రంతో పాటు.. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. భద్రతా విషయమై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal) మన దేశంలో ప్రధాని మంత్రికే తగిన భద్రత లేకపోతే. .మిగతా దేశ వాసుల పరిస్థితి ఏంటో అని ప్రధాని మద్ధతుగా మేము మీ వెంటే అంటూ ట్వీట్ చేశారు.
ఇక సైనా నెహ్వాల్ ట్వీట్ పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ చేయడం పెద్ద దుమారం రేపింది. నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో, వివాదాస్పద వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువగానే వార్తల్లో నిలిచాడు హీరో సిద్ధార్థ్ (Actor Siddharth). ‘బొమ్మరిల్లు’ వంటి డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్లీ హిట్టు కొట్టలేకపోయిన సిద్ధార్థ్... ‘తెలువారికి టేస్ట్ లేదంటూ’ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. తాజాగా అల్లుఅర్జున్ హీరోగా నటించిన ‘పుష్ఫ’ సినిమా కలెక్షన్లపై ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేసి, బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సిద్ధార్థ్... ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు.
లేటెస్ట్ గా సిద్ధార్థ్ సైనా ట్వీట్ కు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు పెద్ద రచ్చ రేపుతోంది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ సిద్ధార్ధ్ పై మండిపడుతున్నారు. సిద్ధార్థపై ఏకంగా జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సిద్ధార్థ ట్విట్టర్ ఖాతాను వెంటనే డిలీట్ చేయాలని ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసింది. సైనా నెహ్వాల్‌పై అతడు అభ్యంతర కామెంట్స్ చేశాడని..ఈ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. సిద్ధార్ధ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు.
ఇక తను సైనా నెహ్వాల్ పై చేసిన ట్వీట్ తో తనపై ముప్పేట్ దాడి జరగడంతో సిద్ధార్ధ్ వెంటనే తాను సైనా నెహ్వాల్ పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా డియర్ సైనా.. నేను చేసిన ట్వీట్ ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. నాకు మహిళలంటే గౌరవం, మర్యాద ఉందన్నారు. తన మహిళలను కించపరిచేలా చేయలేదని వివరిస్తూ.. జరిగిన దానికి క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశాడు. నా ట్వీట్లో లింగ సమానత్వాన్ని కించ పరిచేలా వ్యాఖ్యలు లేవని వివరణ ఇచ్చుకున్నారు. మొత్తంగా సిద్ధార్ధ్ క్షమాపణలు కోరడంతో ఈ వివాదానికి పులిస్టాప్ పడుతుందా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.