Maayon Movie Review : కట్టప్ప సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మాయోన్’. తాన్య రవిచంద్రన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? శిబిరాజ్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
బాహుబలి ‘కట్టప్ప’ ఫేమ్ సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మాయోన్’. తాన్య రవిచంద్రన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? శిబిరాజ్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
‘అర్జున్’ (శిబి రాజ్) ఆర్కియాలజిస్ట్. తన సీనియర్ అధికారి దేవరాజ్ (హరీష్ పేరడీ)తో చేతులు కలిపి పురాతన వస్తువులను, విగ్రహాలను విదేశాలకి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఈక్రమంలో విజయానందపురంలో అర్జున రాయలు కాలంలో పునర్మించినబడిన శ్రీ కృష్ణుని ఆలయంలో నిధిని దొంగలించి... విదేశాలకు అమ్మేయాలనుకుంటారు. ఈ క్రమంలో ఆర్కియాలజి డిపార్ట్ మెంట్లో పనిచేసే సీనియర్ అధికారి వాసుదేవ్ (KS రవికుమార్)... అతని టీమ్ లో పనిచేస్తున్న అంజన (తాన్య రవిచంద్రన్) ఎపిగ్రాఫిస్ట్ గా... మరో ఇద్దరు కలసి అదే ఆలయంలో నిధి కోసం వెతకడం మొదలు పెడతారు. మరి ఆ నిధి దొరికిందా? అర్జున్, దేవారాజ్ కలసి ఆ నిధిని ఏమి చేసారు? అసలు అర్జున్ ఎవరు? వీరిద్దికీ మెయిన్ విలన్ సామ్స్ ఫెరారీ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది ఈ సినిమా మిగతా కథ.
కథనం.. టెక్నికల్ విషయానికొస్తే..
పురాతన దేవాలయాలు, వాటిలో వున్న నిధి, నిక్షేపాల కోసం ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. కానీ మాయోన్ కథ... కథనాలు వైవిధ్యంగా తెరకెక్కాయి. దర్శకుడు కిశోర్ హీరోను కాకుండా కథను పెట్టుకొని అతనికి తగ్గట్టుగా సూట్ అయ్యే కథను ఎంచుకొని ప్రేక్షకుల్లో ఓ పాజిటివ్ బజను క్రియేట్ చేసారు. సినిమా ప్రారంభం అయింది మొదలు... హీరోయిజాన్ని ఇక్కడా ఎలివేట్ చేయకుండా... కథానుగుణంగా స్క్రీన్ ప్లే రాసుకుని సినిమాను ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా కథ గతంలో తెలుగులో వచ్చిన పాత కథను గుర్తుకు వచ్చినా.. దాన్ని తనదైన పంథాలో తెరకెక్కించారు. పస్టాఫ్ స్లోగా సాగడం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతోంది. సెకాండాఫ్ మాత్రాన్ని పరిగెత్తించాడు. మొత్తంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్ ఈ మూవీ నచ్చుతుంది.
అఖండ,లెజెండ్ వంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన రామ్ ప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించారు. దేవాలయం విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్ బాగుంది. చాలా యేళ్ల తర్వాత ఇళయరాజా సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. శ్లోకం ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
సిబి రాజ్‌కు తమిళంలో పలు చిత్రాల్లో నటించినా.. తెలుగులో మొదటి చిత్రం. యాక్షన్ సీన్స్‌లో శిబి రాజ్ నటన బాగుంది. హీరోయిన్ తాన్య ప్రాధాన్యం వున్న పాత్రలో నటించి మెప్పించింది. గ్రామ పెద్దగా రాధ రవి తనదైన శైలిలో మెప్పించాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్తకాదు. దేవరాజ్ పాత్రలో హరీష్ పేరడీ మెప్పించాడు. తనకి ఇష్టమైన నెగిటివ్ షేడ్స్ లో అందరి మన్ననలు అందుకున్నారు. దర్శకుడు KS రవికుమార్ కూడా ప్రాధాన్యం వున్న రోల్ చేసారు. మొత్తంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికి కచ్చితంగా ‘మాయోన్’ నచ్చుతుంది. గో అండ్ వాచ్ ఇట్.
ప్లస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
సెకండాఫ్
గ్రాఫిక్ వర్క్స్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
అక్కడక్కడ బోర్ కొట్టించే సన్నివేశాలు
చివరి మాట : ’మాయోన్’ మాయ చేసే సస్పెన్స్ థ్రిల్లర్..
రేటింగ్ : 2.75/5
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.