హోమ్ /వార్తలు /సినిమా /

Shyam Singha Roy : చిరంజీవికి నచ్చిన శ్యామ్ సింగ రాయ్.. ఇంకొన్ని గంటల్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..

Shyam Singha Roy : చిరంజీవికి నచ్చిన శ్యామ్ సింగ రాయ్.. ఇంకొన్ని గంటల్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..

Shyam Singha Roy on Netflix Photo :Twitter

Shyam Singha Roy on Netflix Photo :Twitter

Shyam Singha Roy : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

ఇంకా చదవండి ...

నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ.. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాను తాజాగా చూసిన చిరంజీవి టీమ్‌ను ప్రశంసించారు. దీనికి సంబంధించి నాని, చిరంజీవితో ఓ ఫోటోను పంచుకుంటూ ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కి నచ్చింది అని చెప్పడంతో ప్రస్తుతం ఆ ట్వీట్‌తో పాటు ఆ ఫోటో వైరల్‌గా మారాయి.

ఇక ఈ సినిమా ఇంకొద్ది గంటల్లో అంటే అర్థరాత్రి పన్నెండు గంటలకు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి నెట్ ఫ్లిక్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మించారు.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. కలకత్తా నగరం నేపథ్యంలో వింటేజ్ డ్రామాలా సాగిన ఈ శ్యామ్ సింగరాయ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో నడుస్తోంది. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించారు.

ఇక నాని మరో సినిమా టక్ జగదీష్ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రిలీజ్ అయ్యి ఓకే అనిపించుకుంది. ఈ సినిమాలో (Nani) నాని సరసన రీతూ వర్మ (Ritu Varma), నటించగా.. ఐశ్వర్య రాజేష్‌ మరో కీలకపాత్రలో కనిపించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో పోయిన సంవత్సరం సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది.

ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. దసరా రోజున ఆయన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.  అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Chiranjeevi, Nani, Shyam Singha Roy, Tollywood news

ఉత్తమ కథలు