హోమ్ /వార్తలు /movies /

Shyam Singha Roy : శ్యామ్ సింగ రాయ్‌ నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ ధర.. 60 శాతం రికవరీ..

Shyam Singha Roy : శ్యామ్ సింగ రాయ్‌ నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ ధర.. 60 శాతం రికవరీ..

Shyam Singha Roy : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

  నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. సాయి పల్లవి, కృతి శెట్టిలతో పాటు మరో టాలెంటెడ్ నటుడు నటిస్తున్నారు. బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఆయన ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. జిష్షు సేన్ గుప్తా నితిన్ భీష్మా, నాగ శౌర్య అశ్వాద్థామ సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 60 % రికవర్ అయిందని అంటున్నారు. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

  ఇక నాని ఇతర సినిమాల విషయానికి వస్తే.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నారు. మొదటి నుంచి మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్ ను చూస్తే మాత్రం ఓ క్లాస్ అండ్ పవర్ ప్యాక్డ్ గా ఉందని చెప్పొచ్చు.

  shyama singha roy
  shyama singha roy Photo : Twitter

  ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేశారు.  థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

  First published:

  ఉత్తమ కథలు