SHYAM SINGHA ROY NATURAL STAR NANI LATEST MOVIE STREAMING ON NETFLIX TODAY ONWORDS WITH TELUGU TAMIL MALAYALAM VERSIONS TA
Shyam Singha Roy : నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచే మూడు భాషల్లో నాని ‘శ్యామ్ సింగరాయ్’ స్ట్రీమింగ్..
నేటి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో ‘శ్యామ్‌సింగరాయ్’ స్ట్రీమింగ్ (Twitter/Photo)
Shyam Singha Roy - Netflix Streaming : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy) ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Shyam Singha Roy OTT Streaming : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy) ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఈ రోజు అర్ధరాత్రి నుంచి నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది.
‘శ్యామ్ సింగరాయ్’ మూవీని నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఓటీటీ రిలీజ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. శ్యామ్ సింగ రాయ్ మూవీ ఈ రోజునుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాను తాజాగా చూసిన చిరంజీవి ‘శ్యామ్ సింగరాయ్’ టీమ్‌ను ప్రశంసించారు. దీనికి సంబంధించి నాని, చిరంజీవితో ఓ ఫోటోను పంచుకుంటూ ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవికి నచ్చింది అని చెప్పడంతో పాటు చిరంజీవితో నాని మీసం మేలేస్తూ దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌తో పాటు ఆ ఫోటో వైరల్‌గా మారాయి.
నాని ‘శ్యామ్ సింగరాయ్’ ను మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)
ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రోజునే బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ కూడా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. ’శ్యామ్ సింగరాయ్’ విషయానికొస్తే.. ఈ డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) రూ. 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా రూ. 50 కోట్లతో నిర్మించారు.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ చిత్రం ఓవర్సీస్లో 8 లక్షల యూఎస్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి.. వన్ మిలియన్ మార్క్‌కు కొద్ది దూరంలో ఆగిపోయింది. కలకత్తా నగరం నేపథ్యంలో వింటేజ్ డ్రామాలా సాగిన ఈ శ్యామ్ సింగరాయ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో నడుస్తోంది. మొత్తంగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్ల షేర్ రాబట్టింది.
నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. ఏదేమైనా కూడా సరైన సమయంలో మంచి విజయం అందుకున్నాడు నాని. ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.