నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy) ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రం అక్కడ 6 లక్షల యూఎస్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అంతే కాకుండా అదనంగా 20 కొత్త థియేటర్స్ యాడ్ చేశారట. దీంతో అక్కడ రెండో వారంలో శ్యామ్ సింగ రాయ్ చిత్రం మొత్తంగా 200 థియేటర్స్ లో ప్రదర్శితం అవుతున్నట్టు వారు తెలిపింది టీమ్. కలకత్తా నగరం నేపథ్యంలో వింటేజ్ డ్రామాలా సాగిన ఈ శ్యామ్ సింగరాయ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
నాని శ్యామ్ సింగ రాయ్ ఐదు రోజుల కలెక్షన్స్‌ను చూస్తే..
Nizam: 7.28Cr(inc GST)
Ceeded: 1.91Cr
UA: 1.63Cr
East: 73L
West: 60L
Guntur: 90L
Krishna: 68L
Nellore: 46L
AP-TG Total:- 14.19CR(24.10CR~ Gross)
Ka+ROI: 2.45Cr
OS – 3.30Cr
Total WW: 19.94CR(35.45CR~ Gross)
ఈ సినిమా 4వ రోజు 1.38 కోట్ల షేర్ ని సాధిస్తే 5వ రోజు మాత్రం కేవలం 74 లక్షల షేర్ తోనే సినిమా సరిపెట్టుకుంది. ఈ సినిమా 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగగా.. ఇంకా 2.56 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండనుందో.. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించారు.
#ShyamSinghaRoy collects $600K+ Counting in US🤘
20+ new theatres getting added for 2nd week,Will be playing around 200+ theatres 💥💥
Overseas by @Radhakrishnaen9 #BlockBusterClassicSSR 🔥@NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @Rahul_Sankrityn @NiharikaEnt pic.twitter.com/fnFrht6e0Y
— Niharika Entertainment (@NiharikaEnt) December 29, 2021
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మించారు.
Pushpa | Allu Arjun : హిందీలో ఏమాత్రం తగ్గని పుష్ప కలెక్షన్స్.. యాబై కోట్ల చేరువలో..
ఇక నాని తాజా సినిమా టక్ జగదీష్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో (Nani) నాని సరసన రీతూ వర్మ (Ritu Varma), నటించగా.. ఐశ్వర్య రాజేష్ మరో కీలకపాత్రలో కనిపించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది. ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. దసరా రోజున ఆయన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.