SHYAM SINGHA ROY CENSOR COMPLETED HERE ARE THE DETAILS SR
Shyam Singha Roy : సెన్సార్ పూర్తి చేసుకున్న శ్యామ్ సింగ రాయ్.. నిడివి ఎంతంటే..
నాని ‘శ్యామ్ సింగరాయ్’ (Twitter/Photo)
Shyam Singha Roy : ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సెన్సార్ అయ్యిందని తెలుస్తోంది.
నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy) ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సెన్సార్ అయ్యిందని తెలుస్తోంది. శ్యామ్ సింగ రాయ్‌కు సెన్సార్ టీమ్ U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నిడివి ఉండనుంది. దీనికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను టీమ్ భారీగా నిర్వహిస్తోంది. శ్యామ్ సింగ రాయ్ ప్రిరిలీజ్ ఈవెంట్ ఈనెల 18న హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో ప్లాన్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి టాక్‌ను తెచ్చుకుంది. టూ డిఫరెంట్ లుక్స్ లో నాని కనిపిస్తున్నారు. యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా కోసం నాని కొంత బోల్డ్ స్టెప్ వేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాని తొలిసారి తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను ఈరోజు చెన్నైలోని సత్యం సినిమాస్‌లో విడుదల చేసింది చిత్రబృందం.
మరోవైపు ప్రమోషన్స్‌లో భాగంగా ఆ మధ్య ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'ఏదో ఏదో' అంటూ సాగే ఈ ప్రేమగీతానికి మిక్కీ జె. మేయర్ మంచి వినసొంపైన సంగీతం అందించారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. చైత్ర అంబడిపుడి పాడారు. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. నాని, హీరోయిన్ కృతి శెట్టి ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్‌లో మూడు మిలియన్ వ్యూస్ సాధించి అదరగొడుతోంది. దీంతో చిత్రబృందం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ నటుడు నటిస్తున్నారు. బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 60 % రికవర్ అయిందని సమాచారం. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు టాక్.
ఇక నాని తాజా సినిమా టక్ జగదీష్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో (Nani) నాని సరసన రీతూ వర్మ (Ritu Varma), నటించగా.. ఐశ్వర్య రాజేష్ మరో కీలకపాత్రలో కనిపించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది. ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. దసరా రోజున ఆయన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.