Home /News /movies /

SHYAM SINGHA ROY AMERICA COLLECTIONS CLOSE TO ONE MILLION MARK HERE ARE THE DETAILS SR

Shyam Singha Roy : అమెరికాలో అదరగొడుతోన్న శ్యామ్ సింగ రాయ్.. మిలియన్ మార్క్‌కు చేరువలో..

నాని శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్ (shyam singha roy)

నాని శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్ (shyam singha roy)

Shyam Singha Roy : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

ఇంకా చదవండి ...
    నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీక్ వర్కింగ్ డేస్‌లో తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా డౌన్ అయింది. అయితే అమెరికాలో మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 8 లక్షల డాలర్స్‌ను క్రాస్ చేసిందని అంటున్నారు. దీంతో ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా అక్కడ వన్ మిలియన్ మార్క్‌ను దాటనుందని అంటున్నారు. ఇక ఈ సినిమా పన్నెండు రోజుల తర్వాత 22.5 కోట్ల టార్గెట్ రీచ్ అయ్యి 2.45 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

    ఇక అది అలా ఉంటే ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఓటీటీ రిలీజ్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ విడుదలైన నాలుగు వారాలకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది 2022 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మించారు.


    నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించారు. ఇక నాని తాజా సినిమా టక్ జగదీష్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో (Nani) నాని సరసన రీతూ వర్మ (Ritu Varma), నటించగా.. ఐశ్వర్య రాజేష్‌ మరో కీలకపాత్రలో కనిపించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది. ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. దసరా రోజున ఆయన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.

    Pushpa Hindi | Allu Arjun : పుష్ప హిందీ కలెక్షన్స్.. వీక్ డేస్‌లో కూడా సూపర్ స్ట్రాంగ్..

    ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.  అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Shyam Singha Roy, Tollywood news

    తదుపరి వార్తలు