డిసెంబర్ 24న విడుదలైన నాని శ్యామ్ సింగరాయ్ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. విడుదలైన 9వ రోజు అంటే జనవరి 1న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే 2 కోట్ల వరకు షేర్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల వరకు వసూలు చేసింది. రెండేళ్ళ తర్వాత నాని సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. ముందు నుంచి చెప్పినట్లుగానే మరోసారి ఆకట్టుకుంటున్నాడు నాని. ఈయన హీరోగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. 9వ రోజు ఏపీ, తెలంగాణలోనే 1.98 కోట్ల షేర్ వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్.. ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో దాదాపు 23.23 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాకు రావాల్సిన దానికంటే తక్కువగానే వస్తున్నాయి వసూళ్లు. దానికి ఎవరూ ఏం చేయలేరు. ఈ సినిమా 9 రోజుల కలెక్షన్స్ చూద్దాం..
నైజాం: 8.69 కోట్లు
సీడెడ్ 2.37 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.91 కోట్లు
ఈస్ట్: 0.95 కోట్లు
వెస్ట్: 0.74 కోట్లు
గుంటూరు: 1.05 కోట్లు
కృష్ణా: 0.84 కోట్లు
నెల్లూరు: 0.57 కోట్లు
AP-TG 9 డేస్ కలెక్షన్స్: 17.17 కోట్లు (29.13 కోట్లు గ్రాస్)
కర్ణాకట+ROI: 2.71 కోట్లు
ఓవర్సీస్: 3.45 కోట్లు
టోటల్ 9 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 23.33 కోట్లు (40 కోట్లు గ్రాస్)
ఈ సినిమాకు 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ ఈయన నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడం.. థియేటర్స్‌కు రెండేళ్ల తర్వాత రావడంతో బిజినెస్ తక్కువగానే చేసారు దర్శక నిర్మాతలు. ఓపెనింగ్స్ బాగానే ఉండటంతో 8వ రోజు ఈ చిత్రం సేఫ్ అయింది. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. 9వ రోజు చాలా చోట్ల కలెక్షన్స్ పుంజుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.