హోమ్ /వార్తలు /సినిమా /

Shyam Singha Roy 5 days collections: ‘శ్యామ్ సింగరాయ్’ 5 డేస్ కలెక్షన్స్.. భారీగా పడిపోయిన వసూళ్లు..

Shyam Singha Roy 5 days collections: ‘శ్యామ్ సింగరాయ్’ 5 డేస్ కలెక్షన్స్.. భారీగా పడిపోయిన వసూళ్లు..

నాని ‘శ్యామ్ సింగరాయ్’ 24 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

నాని ‘శ్యామ్ సింగరాయ్’ 24 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

Shyam Singha Roy 5 days collections: ఈ సినిమాకు 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాని (Nani) గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. ఐదో రోజు చాలా చోట్ల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా 74 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 94 లక్షల షేర్ తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...

రెండేళ్ళ తర్వాత నాని సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. ముందు నుంచి చెప్పినట్లుగానే మరోసారి ఆకట్టుకుంటున్నాడు నాని. ఈయన హీరోగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. 5వ రోజు ఏపీ, తెలంగాణలోనే 74 లక్షలకు పైగా షేర్ వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్.. ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో దాదాపు 20 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాకు రావాల్సిన దానికంటే తక్కువగానే వస్తున్నాయి వసూళ్లు. దానికి ఎవరూ ఏం చేయలేరు. వీక్ డేస్‌లో నిలబడితే సినిమా నిలబడినట్లు.. లేదంటే అంతే సంగతులు. అయితే ప్రస్తుతం మరో 2.50 కోట్లు మాత్రమే దూరంలో ఉంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్స్ చూద్దాం..

నైజాం: 7.28 కోట్లు

సీడెడ్ 1.91 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.63 కోట్లు

ఈస్ట్: 0.73 కోట్లు

వెస్ట్: 0.60 కోట్లు

గుంటూరు: 0.90 కోట్లు

కృష్ణా: 0.68 కోట్లు

నెల్లూరు: 0.46 కోట్లు

AP-TG 5 డేస్ కలెక్షన్స్: 14.19 కోట్లు (24.10 కోట్లు గ్రాస్)

కర్ణాకట+ROI: 2.45 కోట్లు

ఓవర్సీస్: 3.30 కోట్లు

టోటల్ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 19.94 కోట్లు (35.45 కోట్లు గ్రాస్)

Top 10 Most Handsome Men in World 2021: ప్రపంచంలో టాప్ 10 అందగాళ్ళు ఎవరంటే.. లిస్టులో మహేష్ బాబు..


ఈ సినిమాకు 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ ఈయన నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడం.. థియేటర్స్‌కు రెండేళ్ల తర్వాత రావడంతో బిజినెస్ తక్కువగానే చేసారు దర్శక నిర్మాతలు. ఓపెనింగ్స్ బాగానే ఉండటంతో కచ్చితంగా వారం రోజుల తర్వాత శ్యామ్ సింగరాయ్ సేఫ్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. ఐదో రోజు చాలా చోట్ల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా 74 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 94 లక్షల షేర్ తీసుకొచ్చింది.

First published:

Tags: Box Office Collections, Hero nani, Shyam Singha Roy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు