Shyam Singha Roy 24 days collections: డిసెంబర్లో విడుదలైన సినిమాలకు ఇప్పటికీ అంతో ఇంతో కలెక్షన్స్ వస్తుండటం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సంక్రాంతికి కూడా ఆ సినిమాలు థియేటర్స్‌లో ఉండటం చిన్న విషయం కాదు. డిసెంబర్ 24న విడుదలైన నాని శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy 24 days collections) సినిమా వసూళ్లు చివరికి వచ్చేసాయి.
డిసెంబర్లో విడుదలైన సినిమాలకు ఇప్పటికీ అంతో ఇంతో కలెక్షన్స్ వస్తుండటం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సంక్రాంతికి కూడా ఆ సినిమాలు థియేటర్స్‌లో ఉండటం చిన్న విషయం కాదు. డిసెంబర్ 24న విడుదలైన నాని శ్యామ్ సింగరాయ్ సినిమా వసూళ్లు చివరికి వచ్చేసాయి. విడుదలైన 24వ రోజు అంటే జనవరి 16న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కేవలం 7 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల వరకు వసూలు చేసింది. రెండేళ్ళ తర్వాత నాని సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. ముందు నుంచి చెప్పినట్లుగానే ఆకట్టుకుంటున్నాడు నాని. ఈయన హీరోగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. 24వ రోజు ఏపీ, తెలంగాణలోనే దారుణంగా పడిపోయాయి కలెక్షన్స్. శ్యామ్ సింగరాయ్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 24 రోజుల్లో దాదాపు 27 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాకు రావాల్సిన దానికంటే తక్కువగానే వస్తున్నాయి వసూళ్లు. దానికి ఎవరూ ఏం చేయలేరు. ఈ సినిమా 24 రోజుల కలెక్షన్స్ చూద్దాం..
ఆ సినిమాకు 22.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరస ఫ్లాపులకు తోడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా నాని సినిమాకు తక్కువ బిజినెస్ జరిగింది. ఓపెనింగ్స్ బాగానే ఉండటంతో ఈ చిత్రం సేఫ్ అయింది. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. ఏదేమైనా కూడా సరైన సమయంలో మంచి విజయం అందుకున్నాడు నాని. ఈయన ప్రస్తుతం దసరా సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.