Shyam Singha Roy 12 days World Wide collections : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. దాదాపు రెండేళ్ళ లాంగ్ తర్వాత నాని హీరోగా నటించిన మూవీ థియేటర్స్‌లో విడుదలైంది. గతేడాది చివర్లో విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ మూవీలో నాని (Natural Star Nani ) రెండు డిఫరెంట్ పాత్రల్లో ఆకట్టుకున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కొంత మంది మనోభావాలు దెబ్బ తీసారనే వ్యాఖ్యలు మినహా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. హీరోగా నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి (Sai Pallavi) కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. కృతి శెట్టి (Krithi Shetty) ఉన్నంతలో గ్లామర్‌లో అలరించింది.
పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. 14వ రోజు ఏపీ, తెలంగాణలోనే రూ. 10 లక్షల షేర్ రాబట్టింది. మొత్తంగా చూస్తే ఈ కలెక్షన్స్ పెద్దగా ఇరగదీసింది లేదు. శ్యామ్ సింగరాయ్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2వ వారంలో దాదాపు రూ. 25.30 కోట్లు షేర్ వసూలు చేసింది.
Unstoppable with NBK : లయన్ షోలో లైగర్.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో అర్జున్ రెడ్డి Vs సమరసింహా రెడ్డి..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాను తక్కువ రేటుకు అమ్మడంతో ఏదో సేఫ్ అయింది చెప్పాలి. ఐనా రావాల్సిన దానికంటే తక్కువగానే వస్తున్నాయి వసూళ్లు. మొత్తంగా 18వ రోజు దునియా మొత్తంలో రూ. 18 లక్షలు వసూళ్లు సాధించింది.
నైజాం (తెలంగాణ): రూ. 9.33 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) రూ. 2.65 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.14 కోట్లు
ఈస్ట్: రూ. 1.09 కోట్లు
వెస్ట్: రూ. 0.84 కోట్లు
గుంటూరు: రూ. 1.17 కోట్లు
కృష్ణా: రూ. 0.96 కోట్లు
నెల్లూరు: రూ.0.64 కోట్లు
AP-TG 5 డేస్ కలెక్షన్స్: రూ. 18.82 కోట్లు (రూ.32 కోట్లు గ్రాస్)
కర్ణాకట+ROI: రూ. 2.90 కోట్లు
ఓవర్సీస్: రూ. 3.58 కోట్లు
టోటల్ 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రూ.25.30 కోట్లు (రూ. 44.30 కోట్లు గ్రాస్)
Dhanush As Sir : ధనుశ్ తెలుగు మూవీ ‘సార్’ షూటింగ్ ప్రారంభం.. అదిరిన లుక్..
‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ ఈయన నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడం.. థియేటర్స్‌కు రెండేళ్ల తర్వాత రావడంతో బిజినెస్ తక్కువగానే చేసారు దర్శక నిర్మాతలు. . సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. మొత్తంగా చూసుకుంటే.. 2వారం పూర్తి కాగానే 14వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 లక్షల వసూళ్లు సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krithi shetty, Natural star nani, Sai Pallavi, Shyam Singha Roy, Tollywood