SHYAM SINGHA ROY 1ST DAY WW COLLECTIONS NATURAL STAR NANI MOVIE GETS IMPRESSIVE OPENING DAY PK
Shyam Singha Roy 1st day WW collections: ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. మంచి ఓపెనింగ్స్ తెచ్చిన నాని..
శ్యామ్ సింగరాయ్ Photo : Twitter.
Shyam Singha Roy 1st day WW collections: నాని (Nani) హీరోగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy 1st day WW collections). పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి కూడా తన పాత్రలో ఆకట్టుకుంది.
నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. తొలిరోజు ఏపీ, తెలంగాణలోనే 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను దాటుకుని చాలా మంచి వసూళ్లు తీసుకొచ్చింది శ్యామ్ సింగరాయ్. టాక్ బాగానే ఉండటంతో కచ్చితంగా వీకెండ్ బాగా పర్ఫార్మ్ చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు 22 కోట్ల బిజినెస్ జరిగింది.
AP-TG ఫస్ట్ డే కలెక్షన్స్: 4.17 కోట్లు (6.90 కోట్లు గ్రాస్) కర్ణాకట+ROI: 1.30 కోట్లు ఓవర్సీస్: 1.35 కోట్లు టోటల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 6.82 కోట్లు (12 కోట్లు గ్రాస్)
ఈ సినిమాకు 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ ఈయన నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడం.. థియేటర్స్‌కు రెండేళ్ల తర్వాత రావడంతో బిజినెస్ తక్కువగానే చేసారు దర్శక నిర్మాతలు. ఓపెనింగ్స్ బాగానే ఉండటంతో కచ్చితంగా మూడు రోజుల తర్వాత శ్యామ్ సింగరాయ్ సేఫ్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.