Home /News /movies /

SHYAM SINGHA ROY 12 DAYS COLLECTIONS NANI SAI PALLAVI GOT DECENT HIT TA

Shyam Singha Roy 12 days collections : ‘శ్యామ్ సింగరాయ్’ 12 డేస్ కలెక్షన్స్.. నాని రేంజ్‌కు ఇవి సరిపోతాయా..

నాని శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్  (Natural Star Nani Shyam Singa Roy)

నాని శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్ (Natural Star Nani Shyam Singa Roy)

Shyam Singha Roy 12 days World Wide collections : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. ఈ మూవీ 12 రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే..

    Shyam Singha Roy 12 days World Wide collections : నాచురల్ స్టార్ నాని    హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. దాదాపు రెండేళ్ళ తర్వాత నాని హీరోగా నటించిన మూవీ  థియేటర్స్‌లో విడుదలైంది. గతేడాది చివర్లో విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ మూవీలో నాని (Natural Star Nani ) రెండు పాత్రల్లో ఆకట్టుకున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కొంత మంది మనోభావాలు దెబ్బ తీసారనే వ్యాఖ్యలు మినహా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. హీరోగా నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి (Sai Pallavi) కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. కృతి శెట్టి (Krithi Shetty) ఉన్నంతలో గ్లామర్‌లో అలరించింది.

    పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. 12వ రోజు ఏపీ, తెలంగాణలోనే రూ. 15 లక్షల షేర్ రాబట్టింది. మొత్తంగా చూస్తే ఈ కలెక్షన్స్ పెద్దగా లేవు. శ్యామ్ సింగరాయ్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో దాదాపు రూ.  24.95 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాకు రావాల్సిన దానికంటే తక్కువగానే వస్తున్నాయి వసూళ్లు. దానికి ఎవరూ ఏం చేయలేరు. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్స్ చూద్దాం..

    HBD Deepika Padukone : హ్యాపీ బర్త్ డే దీపికా పదుకొణే.. ఈమె గురించి ఈ నిజాలు తెలుసా..

    నైజాం (తెలంగాణ): రూ. 9.24 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ) రూ.  2.62 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 2.12 కోట్లు
    ఈస్ట్: రూ. 1.07 కోట్లు
    వెస్ట్: రూ. 0.83 కోట్లు
    గుంటూరు: రూ. 1.15 కోట్లు
    కృష్ణా: రూ. 0.94 కోట్లు
    నెల్లూరు:  రూ.0.63 కోట్లు

    AP-TG 5 డేస్ కలెక్షన్స్: రూ. 18.60 కోట్లు (రూ.31.60 కోట్లు గ్రాస్)
    కర్ణాకట+ROI: రూ. 2.83 కోట్లు
    ఓవర్సీస్: రూ. 3.52 కోట్లు
    టోటల్ 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రూ.24.95 కోట్లు (రూ. 43.66 కోట్లు గ్రాస్)

    ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ ఈయన నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడం.. థియేటర్స్‌కు రెండేళ్ల తర్వాత రావడంతో బిజినెస్ తక్కువగానే చేసారు దర్శక నిర్మాతలు. . సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. 12వ రోజు చాలా చోట్ల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Box Office Collections, Nani, Shyam Singha Roy, Tollywood

    తదుపరి వార్తలు