Home /News /movies /

SHYAM K NAIDU POLICE CASE FILED AGAINST CAMERAMAN SHYAM K NAIDU AT VIJAYAWADA ONE TOWN POLICE STATION TA

Shyam K Naidu: సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె నాయుడు పై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..

శ్యామ్ కే నాయుడు పై పోలీస్ కేసు నమోదు (File/Photo)

శ్యామ్ కే నాయుడు పై పోలీస్ కేసు నమోదు (File/Photo)

Shyam K Naidu: ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే.నాయుడుపై ప్రముఖ నటి శ్రీసుధ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.

    Shyam K Naidu: ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే.నాయుడుపై ప్రముఖ నటి శ్రీసుధ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. శ్యామ్ కె నాయుడు విషయానికొస్తే.. తెలుగు సిని  ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన అన్నయ్య ఛోటా కే నాయుడు కూడా ప్రముఖ సినిమాటోగ్రఫర్. ఈయన తెలుగులో చాలా సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగులో పోకిరి, బిజినెష్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు సహా పలు సూపర్ హిట్ చిత్రాలకు కెమెరా మెన్‌గా పనిచేసారు. ఈయన ప్రముక కథానాయకుడు సందీప్ కిషన్‌కు స్వయానా మేనమామ. ఈయనపై ప్రముఖ నటి శ్రీ సుధ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసారు. విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ పై తన కారును ఢీ కొట్టి హత్నా ప్రయత్నం చేసినట్టు తన కంప్లైంట్‌లో పేర్కొంది. విజయవాడ ఫ్లై ఓవర్ పై యాక్సిడెంట్ చేసి తనను చంపే ప్రయత్నం చేసినట్టు పేర్కొంది.

    Shyam K Naidu Police Case Filed Against Cameraman shyam K Naidu at Vijayawada one Town Police Station,Shyam K Naidu: సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె నాయుడు పై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..,shyam k naidu,shyam k naidu vijayawada Police Station,Police Case Filed Against Shyam K Naidu,shyam k naidu arrest,shyam k naidu sr nagar police station,shyam k naidu sai sudha case,shyam k naidu cheating case,shyam k naidu chota k naidu,shyam k naidu drugs case,shyam k naidu puri jagannadh,shyam k naidu movies,telugu cinema,శ్యామ్ కే నాయుడు,శ్యామ్ కే నాయుడు అరెస్ట్,శ్యామ్ కే నాయుడు సాయి సుధ ఛీటింగ్ కేసు,శ్యామ్ కే నాయుడుపై విజయవాడలో కేసు నమోదు
    సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు పై పోలీస్ కేసు నమోదు (shyam k naidu sai sudha)


    పోలీసులు కూడా  కేసు నమోదు చేసి నిజా నిజాలు రాబట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే శ్రీ సుధ .. శ్యామ్ కే నాయుడుపై హైదారాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేసాడని సినీ నటి శ్రీ సుధ ఈ ఫిర్యాదు చేసింది. ఆ కంప్లైంట్ చేసినందుకే తనపై హత్యాయత్నానికి అతను పాల్పడినట్టు పేర్కొంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Shyam K Naidu, Tollywood, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు