అదే హీరోతో మళ్లీ బలుపు చూపిస్తున్న శృతి హాసన్..

గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న రవితేజ 66వ చిత్రం ద్వారా.. శృతి హాసన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా, ఇదే కాంబినేషన్‌లో వచ్చిన బలుపు మంచి టాక్ తెచ్చుకుంది.

news18-telugu
Updated: October 30, 2019, 2:50 PM IST
అదే హీరోతో మళ్లీ బలుపు చూపిస్తున్న శృతి హాసన్..
శృతి హాసన్
  • Share this:
తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయి వరకు వెళ్లి ఒక్క సారిగా ఢమాల్ అని కింద పడ్డ కమల్ హాసన్ గారాలపట్టి శృతి హాసన్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన కాటమరాయుడు చేశాక సినిమాలకు దూరం జరిగిన ఈ బ్యూటీ.. మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డది. అతడితో కలిసి షికార్లు కొట్టింది కూడా. అయితే, వారి ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పడటంతో మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్టు చేస్తూ, బ్రాండింగ్‌లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి లాభం చిత్రంలో నటిస్తోంది. అమెరికన్ వెబ్ సిరీస్ ట్రెడ్‌స్టోన్‌లో శృతి హాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తోంది. రామిన్ బ‌హ్రానీ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో నీరా ప‌టేల్ పాత్రలో శృతి మెప్పించేందుకు రెడీ అవుతోంది. అయితే, తెలుగులో 2017లో వచ్చిన కాటమరాయుడు సినిమా చేశాక.. రెండేళ్లకు రీ ఎంట్రీకి సిద్ధమైంది.

రవితేజ 66వ చిత్రంలో హీరోయిన్‌గా శృతి హాసన్ (Twitter Photo)


గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న రవితేజ 66వ చిత్రం ద్వారా.. ఈ బ్యూటీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా, ఇదే కాంబినేషన్‌లో వచ్చిన బలుపు మంచి టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా ఓ విధంగా చెప్పాలంటే రవితేజ కెరీర్‌ను నిలబెట్టింది. ఇప్పుడు కూడా ఫ్లాపులతో ఉన్న రవితేజ.. ఈ సినిమా ద్వారా పాత స్టామినా చూపేందుకు రెడీ అవుతున్నాడు. కాగా.. రవితేజ నటిస్తున్న డిస్కో రాజా డిసెంబరు 25న రిలీజ్ కాబోతోంది.

First published: October 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...