హోమ్ /వార్తలు /సినిమా /

ఆ వాసన అంటే ఇష్టం.. కాల్ రికార్డ్స్ ఎక్కువగా చేస్తుంటా.. : శృతి హాసన్

ఆ వాసన అంటే ఇష్టం.. కాల్ రికార్డ్స్ ఎక్కువగా చేస్తుంటా.. : శృతి హాసన్

శృతి హాసన్ Photo : Twitter

శృతి హాసన్ Photo : Twitter

శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తుంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న శృతి సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

    Shruti Haasan : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘కాటమరాయుడు’ మూవీ తర్వాత తెలుగు సినిమాలు తగ్గించేసింది. దీనికి తోడు శృతి నటించిన సినిమాలు వరుసగా ప్లాప్స్ కావడంతో ఈ భామకు ఇటు తెలుగులో కానీ, అటూ తమిళ్‌లోగానీ సరైనా సినిమా అవకాశాలు రావాట్లేదు. మరోవైపు శృతి గతంలో కొంత కాలం ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్‌ చేసి.. ఆ తర్వాత విడిపోయింది ఈ జంట. ఇవన్నీ కూడా శృతిని కుంగదీసాయనే అంటారు ఆమె అభిమానులు. దీంతో అడపదడపా సినిమా అవకాశాలు వచ్చిన కొన్నింటిని రిజెక్ట్ చేసిందని టాక్. ప్రస్తతం కారోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉంటున్న శృతి తాజాగా సోషల్ మీడియా వేదికగా తనకు సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను తన అభిమానులతో పంచుకుంది. తనకు సిగరెట్‌, పొగాకు వాసన అంటే ఇష్టమని చెప్పింది. అయితే, వాటిని కాల్చినప్పుడు వచ్చే వాసన మాత్రం నచ్చదంది. గులాబి, చాక్లెట్‌, పెన్సిల్, వెనిలా ఫ్లేవర్ వాసన అంటే కూడా ఇష్టమని పేర్కోంది. తన చిన్నప్పుడు ఎరైజర్ వాసనను ఎక్కువగా ఇష్టపడేదానినని.. తనకు వచ్చే ఫోన్‌ కాల్స్‌ను ఎక్కువుగా రికార్డు చేస్తానని.. తన ఫోన్‌లో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఈమెయిల్‌, మెస్సేజ్‌ల తర్వాత కాల్‌ రికార్డ్‌ యాప్‌ను ఎక్కువగా వాడుతానని.. తాను ఎక్కువగా ఉపయోగించే యాప్ ఇదేనని తెలిపింది. ఇక శృతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తుంది. గోపిచంద్ మలినేని దర్శకుడు. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Raviteja, Shruti haasan, Tollywood

    ఉత్తమ కథలు