ఆర్థిక సమస్యల్లో శృతి హాసన్.. కారణం అదేనా..

Shruti Haasan : సూపర్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఆర్థిక సమస్యలతోటి సతమతమవుతోందట.

news18-telugu
Updated: May 23, 2020, 3:23 PM IST
ఆర్థిక సమస్యల్లో శృతి హాసన్.. కారణం అదేనా..
శృతి హాసన్ Photo : Twitter
  • Share this:
Shruti Haasan : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘కాటమరాయుడు’ మూవీ తర్వాత తెలుగు సినిమాలు తగ్గించేసింది. దీనికి తోడు శృతి నటించిన సినిమాలు వరుసగా ప్లాప్స్ కావడంతో ఈ భామకు ఇటు తెలుగులో కానీ, అటూ తమిళ్‌లోగానీ సరైనా సినిమా అవకాశాలు రావాట్లేదు. మరోవైపు శృతి గతంలో కొంత కాలం ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్‌ చేసి.. ఆ తర్వాత విడిపోయింది ఈ జంట. ఇవన్నీ కూడా శృతిని కుంగదీసాయనే అంటారు ఆమె అభిమానులు. దీంతో అడపదడపా సినిమా అవకాశాలు వచ్చిన కొన్నింటిని రిజెక్ట్ చేసిందని టాక్. అయితే తాజాగా శృతి హాసన్ మాట్లాడుతూ.. తనకూ ఆర్థిక సమస్యలు వున్నాయని చెబుతోంది. సినిమా ఇండస్ట్రీపై కరోనా ప్రభావం మామూలుగా లేదు. నిర్మాతలు విడుదల కావాల్సిన సినిమాలు సమయానికి విడుదల అవ్వక ఆర్థికంగా చితికిపోతున్నారు. రోజువారి కూలీలు పనిలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇటు షూటింగులు లేక, డబ్బులు రాక ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఈ అర్థిక నష్టాలు స్టార్ హీరోయిన్లకి కూడా ఉన్నాయి. శృతిహాసన్ కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఎదుర్కొంటుందట. అయితే తండ్రి కమల్ హాసన్ ని అడిగితే డబ్బులు ఇచ్చేస్తాడని, కానీ అలా అడగడం తనకి ఇష్టం లేదని పేర్కొంది శృతి. దానికి తన మనసు అంగీకరించదని.. ఎవరి పైనా ఆధారపడి బతకకూడదన్నది తన అభిమతం కాదని చెప్పింది. ఇక శృతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తుంది. గోపిచంద్ మలినేని దర్శకుడు. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading