SHRUTI HASSAN CLAPS BACK AT RUMOURS OF BEING HOSPITALISED SB
Shruthi Haasan:నేను ఆస్పత్రిలో ఎక్కడున్నా.. కారులో ఉన్నా.. శృతి హాసన్ వీడియో వైరల్
Photo Twitter
శృతిహాసన్. టాలీవుడ్లో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది శృతి. ప్రభాస్‌తో కలిసి 'సలార్', చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది
కోలివుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారిన ముద్దుగుమ్మ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. శృతి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా శృతి ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం సరిగాలేదని ఆస్పత్రిలో జాయిన్ అయ్యిందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో తన హెల్త్‌కు సంబంధించి శృతియే తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఓ వీడియోను పోస్టు చేసి తాను చాలా హెల్దీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరింది.. శృతిహాసన్. టాలీవుడ్లో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది శృతి. ప్రభాస్‌తో కలిసి 'సలార్', చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మధ్య ఆమె పోస్టు చేసిన వీడియో ఒకటి ఆమెను చిక్కుల్లో పడేసింది. వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్టు చేసిన శృతి... తనకున్న హార్మోనల్ ఇష్యూస్ గురించి చెప్పుకొస్తూ.. తాను మానసికంగా ఎంతో ధృడంగా ఉన్నా, ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపింది. హార్మోన్ బ్యాలెన్స్ తప్పడంతో PCODతో బాధపడుతుంటానని తెలిపింది.
దీంతో పలు మీడియా ఛానల్స్‌లో శృతి హాసన్ ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందని కథనాలు ప్రచురించారు. ఈ విషయంపై శ్రుతి ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండటంతో, తాజాగా ఈ అంశంపై శ్రుతి స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తాను చాలా బాగున్నానని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్లో బిజీగా ఉన్నానని శ్రుతి ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేసింది. తాను ఎక్కడ ఏ ఆస్పత్రిలో కూాడా జాయిన్ కాలేదని.. స్వేచ్ఛగా కారులోనే తిరుగుతున్నానని పేర్కొంది. కారులో కూర్చొనే శృతి వీడియోను పోస్టు చేసింది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.