Shruti Haasan - Salaar - Prabhas: ‘సలార్’తో శృతి హాసన్ రొమాన్స్.. అఫీషియల్‌గా ప్రకటించిన చిత్ర యూనిట్..

ప్రభాస్ సరసన శృతి హాసన్ (Twitter/Photo)

Shruti Haasan - Salaar - Prabhas: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్‌‌ను ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.

  • Share this:
    Shruti Haasan - Salaar - Prabhas: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. ఈ సినిమా ఈ నెల 15న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సింగరేణిలో ప్రారంభైంది. రేపటి నుంచి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాను ప్రశాంత్ నీల్...ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.ఓ పక్క కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి అవుతుండగానే ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌తో చేయబోతున్న 'సలార్‌' సినిమాను ప్రారంభించాడు. ఇక 'సలార్‌' కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయం కేటాయిస్తున్నాడని సమాచారం. ఇది పూర్తి కాగానే హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది‌. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘స‌లార్‌’ అనౌన్స్‌మెంట్ రోజు నుండి ప్రేక్ష‌కాభిమానుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచేస్తుంది.

    ఈ సినిమాలో మోహన్‌లాల్‌ కనిపించబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ విషయాన్ని శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటిచింది. ‘సలార్’ చిత్ర యూనిట్‌లోకి స్వాగతం పలుకుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.


    శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రవితేజ సరసన ‘క్రాక్’ మూవీలో నటించి సక్సెస్ అందుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’లో కూడా నటిస్తోంది. తాజాగా ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.

    Shruti Haasan - Salaar - Prabhas Shruthi Haasan as heroine in Prabhas Salaar Movie , Shruti Haasan - Salaar - Prabhas: సలార్’తో శృతి హాసన్ రొమాన్స్.. అఫీషియల్‌గా ప్రకటించిన చిత్ర యూనిట్..
    ‘సలార్’లో ప్రభాస్ సరసన శృతి హాసన్ (Twitter/Photo)


    ఇక ‘సలార్’  చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ప్రభాస్ తన ప్రతి చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాకు కూడా అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా ‘సలార్’ అనే ఉర్దూ పదాన్ని టైటిల్‌గా పెట్టారు. ‘సలార్’ అంటే ధైర్యవంతుడనే అర్ధం ఉంది. రాజకు కుడి భుజంగా వ్యవహరించి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి.  అంతేకాదు బలమైన నాయకుడు అనే అర్ధం కూడా ఉంది. ఇక ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్’ కు సంబంధించిన షూటింగ్ పార్ట్.. వారం పది రోజుల్లో కంప్లీట్ కానుంది. ఇప్పటికే పూజా హెగ్డేకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: