• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SHRUTI HAASAN REVEALED SECRETS OF SALAAR AND PRABHAS MHN

Shruti Haasan - Salaar: శ్రుతిహాసన్ రివీల్ చేసిన ప్రభాస్ సలార్ సీక్రెట్

Shruti Haasan - Salaar: శ్రుతిహాసన్ రివీల్ చేసిన ప్రభాస్ సలార్ సీక్రెట్

Shruti Haasan revealed secrets of Salaar and Prabhas

Shruti Haasan - Salaar: ప్యాన్ ఇండియా మూవీ సలార్‌లో ప్రభాస్ జోడీగా నటిస్తోన్న శ్రుతిహాసన్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి మాట్లాడింది.

  • Share this:
    ప్రేమ పాఠాలతో సినీ పరిశ్రమకు దూరమైన స్టార్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌కు లవ్‌ బ్రేకప్‌ తర్వాత మబ్బులు వీడిపోయాయి. మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా విడుదలైన క్రాక్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ కావడంతో అందరి దృష్టి శ్రుతి హాసన్‌పై పడింది. ప్యాన్‌ ఇండియా సినీ ప్రేక్షకుడికి శ్రుతి హాసన్‌ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. కెరీర్‌ ప్రారంభం నుండి దక్షిణాది, ఉత్తరాది సినిమాలు చేస్తూ వచ్చిన శ్రుతిహాసన్‌ కిట్టిలోకి ఓ గోల్డెన్‌ ఆపర్చ్యునిటీ వచ్చింది. ప్యాన్‌ ఇండియా క్రేజీ మూవీగా తెరకెక్కనున్న సలార్‌ మూవీలో ప్రభాస్‌ జోడీగా శ్రుతి హాసన్‌ నటిస్తుంది. ఈ సినిమా కోసం శ్రుతిహాస‌న్‌కు భారీగానే రెమ్యున‌రేష‌న్ ముడుతుంద‌ని స‌మాచారం.

    శ్రుతిహాస‌న్ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ స‌లార్ సినిమా, ప్ర‌భాస్ గురించి మాట్లాడింది. ‘‘‘స‌లార్‌’ సినిమాలో ప్ర‌భాస్‌తో ప‌నిచేయడం చాలా సంతోషంగా ఉంది. త‌ను చాలా మంచి వ్య‌క్తి. వృత్తి ప‌ట్ల నిబ‌ద్ధ‌త ఉన్న యాక్ట‌ర్‌. సెట్స్‌లో ఎన‌ర్జీతో ఉంటాడు’’ అని తెలియ‌జేసిన శ్రుతిహాస‌న్ త‌న రోల్ గురించి మాత్రం చెప్ప‌లేదు. చెప్ప‌కూడ‌ద‌ని, డిఫ‌రెంట్ పాత్ర చేస్తున్నాన‌ని, ప్రేక్ష‌కాభిమానుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని చెప్పింది శ్రుతిహాస‌న్‌.

    ఈ ఏడాది క్రాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై ముద్దుగుమ్మ రీసెంట్‌గానే త‌న పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంది. ఇప్పుడు తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వకీల్‌సాబ్‌లో న‌టించింది. అలాగే పిట్ట‌క‌థ‌లు అనే తెలుగు యాంథాల‌జీలోనూ న‌టించింది. మ‌రో వైపు విజ‌య్ సేతుప‌తితో క‌లిసి లాభం అనే సినిమాలో న‌టించింది.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు