హోమ్ /వార్తలు /సినిమా /

Shruti Haasan : అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన శృతిహాసన్.. లేకపోయింటే మరోలా ఉండేది..

Shruti Haasan : అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన శృతిహాసన్.. లేకపోయింటే మరోలా ఉండేది..

శృతిహాసన్.. Photo : Twitter

శృతిహాసన్.. Photo : Twitter

Shruti Haasan : స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గతంలో కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది. అందులో మూడు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.. అవేంటో చూద్దాం..

శృతి హాసన్ తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి ప్రవేశించింది. మొదట్లో వరుస సినిమాలతో అలరించినా.. వరుసగా సినిమాలను చేయడం.. అవి సరిగా ఆకట్టుకోకపోవడంతో ఆ మధ్య కేరీర్ పరంగా కొంత సతమతమయ్యింది. దీనికి మరో కారణం ఉందని.. స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో ఆమె లండన్ ప్రేమికుడు మైఖేల్ మాయలో పడి కెరీర్ ని నిర్లక్ష్యం చేసింది అంటారు ఆమె అభిమానులు. అందులో భాగంగానే అప్పట్లో ఆమెకు వచ్చిన అవకాశాలు కూడా వదులుకోవడం జరిగిందని టాక్. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో, శృతి హాసన్ కి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పెద్దగా రావడం లేదు. గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో ఆమె ప్రేమలో పడింది. ఇక ఆమె నటించిన మహేష్ బాబు కొరటాల శివ శ్రీమంతుడు మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రామ్ చరణ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన ఎవడు సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో శృతి హాసన్ తాజాగా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించి బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ప్రస్తుతం శ‌ృతి హాసన్ పలు తెలుగు సినిమాలు చేస్తోంది. అందులో ముఖ్యమైనవి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్. ఈ సినిమా హిందీ పింక్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

శ్రీరామ్ వేణు దర్శకుడు. ఈ సినిమాతో పాటు శృతి హాసన్ మరో బంపర్ ఆఫర్ కొట్టింది. కేజీయఫ్‌తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన దర్శకుడు ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతి మేయిన్ లీడ్ చేస్తోంది. అది అలా ఉంటే కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో శృతి కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది. అవేంటో ఓసారి చూద్దాం..

బిజినెస్ మ్యాన్: మహేష్ బాబు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శృతి హాసన్‌నే అనుకున్నారట. కానీ ఆమె ఏవో కారణాలతో రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం చందమామ కాజల్ అగర్వాల్‌కు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. Photo : Twitter

2 జెర్సీ: నాచురల్ స్టార్ నాని హీరో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన జెర్సీ సినిమాలో కూడా శృతి హాసన్‌ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కూడా శృతిహాసన్ కోల్పోయింది. Photo : Twitter

3 అమర్ అక్బర్ ఆంటోనీ : మాస్ మహారాజా రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో కూడా శృతిని అనుకున్నారట. కానీ ఈ సినిమాను కూడా శృతి రిజెక్ట్ చేసింది. Photo : Twitter

దువ్వాడ జగన్నాధం Dj : అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన “దువ్వాడ జగన్నాధం” సినిమా లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. కానీ శృతి రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. Photo : Twitter

రెబెల్: ప్రభాస్, లాఘవ లారెన్స్ కాంబినేషన్‌లో వచ్చిన రెబెల్‌లో కూడా శృతి హాసన్‌ను మొదట అనుకున్నారట. కానీ ఆమె వదులుకోవడంతో ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. Photo : Twitter

First published:

Tags: Tollywood Movie News

ఉత్తమ కథలు