చేసిన తప్పు తెలుసుకున్న శృతి హాసన్.. ఆయన సినిమాతో రీ ఎంట్రీ..

కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 19, 2019, 11:44 PM IST
చేసిన తప్పు తెలుసుకున్న శృతి హాసన్.. ఆయన సినిమాతో రీ ఎంట్రీ..
శృతిహాసన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్
  • Share this:
కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. పూర్తిగా న‌ట‌న మానేసి సంగీతం వైపు అడుగేస్తుంది శృతిహాస‌న్. సినిమాల్లోకి రాక‌ముందే ఈమె గాయ‌కురాలిగా పేరు తెచ్చుకుంది. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఈనాడు సినిమాకు సంగీత ద‌ర్శ‌కురాలిగా కూడా ప‌ని చేసింది. ఇక సినిమాలు మానేసి.. హాయిగా రాక్‌స్టార్‌గా ఫిక్స్ అయిపోవాల‌ని ఆ మ‌ధ్య ఫిక్సైపోయింది శృతి హాస‌న్. త‌న టీం మొత్తాన్ని సిద్ధం చేసుకుని స్టేజ్ షోలు కూడా ఇవ్వ‌డానికి రెడీ అయింది కూడా.

Shruti Haasan planning her Re Entry but Directors are not interested on Kamal Hasan's daughter pk.. కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. shruti haasan,shruti haasan hot,shruti haasan hot photos,shruti haasan re entry,shruti haasan telugu cinema,shruti haasan katamarayudu,shruti haasan vijay sethupathi movie,shruti haasan pawan kalyan,tollywood,shruti haasan music,శృతిహాస‌న్,రీ ఎంట్రీకి సిద్ధమైన శృతి హాసన్,శృతి హాసన్ కాటమరాయుడు,తెలుగు సినిమా,శృతి హాసన్ విజయ్ సేతుపతి
శృతిహాసన్ ట్విట్టర్ ఫోటో

ఆ మ‌ధ్య ఫారెన్ టూర్స్ కూడా ప్లాన్ చేసింది ఈ భామ‌. వ‌ర‌స‌గా మ్యూజిక్ ప్రిప‌రేష‌న్స్‌తోనే బిజీగా ఉండేది శృతిహాస‌న్. కాట‌మ‌రాయుడు త‌ర్వాత తెలుగులో ఈమె మ‌రో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. రెండేళ్ల కింద వ‌చ్చిన బెహ‌న్ హోగా తేరీ త‌ర్వాత శృతి పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంది. మ‌రాఠీలో మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఒప్పుకున్నా కూడా అది కూడా కుద‌ర్లేదు. సాహో లాంటి సినిమాను కూడా ముందు శృతినే అడిగినా ఆమె కాదంద‌ని టాక్ ఉంది ఇండ‌స్ట్రీలో.

Shruti Haasan planning her Re Entry but Directors are not interested on Kamal Hasan's daughter pk.. కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. shruti haasan,shruti haasan hot,shruti haasan hot photos,shruti haasan re entry,shruti haasan telugu cinema,shruti haasan katamarayudu,shruti haasan vijay sethupathi movie,shruti haasan pawan kalyan,tollywood,shruti haasan music,శృతిహాస‌న్,రీ ఎంట్రీకి సిద్ధమైన శృతి హాసన్,శృతి హాసన్ కాటమరాయుడు,తెలుగు సినిమా,శృతి హాసన్ విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి శృతి హాసన్

అందాల ఆరబోత‌లో ర‌ప్ఫాడించే ఈ ముద్దుగుమ్మ ఉన్న‌ట్లుండి ఇలా సినిమాల నుంచి త‌ప్పుకోవ‌డం అభిమానుల‌కు షాకే. అయితే ఇప్పుడు మాత్రం విజ‌య్ సేతుప‌తి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తుంది ఈ భామ‌. జ‌యంత‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టించ‌బోయే లాభం సినిమాలో హీరోయిన్ గా శృతి హాస‌న్ న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. జ‌గ‌ప‌తిబాబు ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ కెమెరా ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ‌.
First published: February 19, 2019, 11:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading