స్టార్ హీరోయిన్, సీనియర్ స్టార్ హీరో కమల్‌హాసన్ ముద్దుల తనయ శ్రుతిహాసన్ హీరోయిన్గా టాప్ రేంజ్లో ఉన్న సమయంలో ప్రేమ వ్యవహారంతో సినిమాలకు దూరమైంది. అయితే బ్రేకప్
కావడంతో మళ్లీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజి బిజీగా ఉన్న శ్రుతిహాసన్ ఇప్పుడొక ఛాలెంజింగ్ పాత్రలో నటించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు ది బెస్ట్ సెల్లర్ షఈ రోట్ అనే నవలను ఆధారంగా బాలీవుడ్లోఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నారట. నెంబర్ వన్ నవలా రచయితకు, అతని ప్రేయసి మధ్య నడిచే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని టాక్. ఈ నెంబర్ వన్ నవలా రచయిత కుర్రాడేం కాదు సుమా.. ముసలాడు. మరి అతని ప్రేయసి ఏమో మూడు పదుల వయసున్న అమ్మాయి.
ఈ వెబ్ సిరీస్‌లో ముసలాడైన నవలా రచయిత పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ మిథున్ చక్రవర్తి నటిస్తుండగా అతని ప్రేయసి పాత్రలో శ్రుతి హాసన్ నటించనుంది. వెబ్ సిరీస్‌లో నటించడం
శ్రుతి హాసన్‌కు కొత్తేం కాదు. ఇది వరకు హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్‌లో నటించిన శ్రుతి హాసన్ ఇలాంటి పాత్రను చేయడం కొత్తే అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇప్పటి వరకు అలాంటి పాత్ర చేయలేదు. అందుకేనేమో శ్రుతిహాసన్ ఈ పాత్రలో నటించడానికి ఓకే చెప్పి ఉండొచ్చునని అనుకుంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
ఉత్తరాంచల్‌లో ఈ వెబ్‌సిరీస్‌ను చిత్రీకరించాలని అనుకుంటున్నారు. సింగిల్ షెడ్యూల్లోనే షూటింగ్ పూర్తి చేయాలనేది ప్లాన్. దర్శకుడు ముకుల్ అభ్యంకర్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తుంటే, సిద్ధార్థ్ పి.మల్హోత్రా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. మరి డిఫరెంట్ పాత్రలో శ్రుతిహాసన్ ఎలా మెప్పించనుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.