Shruti Haasan: మేకప్ లేకుండా సహజ అందాలతో శృతి హాసన్‌ను చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

మేకప్ లేకుండా శృతి హాసన్ (Instagram/Photo)

Shruti Haasan శృతిహాసన్..తెలుగు, తమిళం, హిందీలో  తన గ్లామర్, నటన, మెస్మరైజింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్‌తో  ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ బ్యూటీకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా మేకప్ లేకుండా దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.

  • Share this:
    Shruti Haasan శృతిహాసన్..తెలుగు, తమిళం, హిందీలో  తన గ్లామర్, నటన, మెస్మరైజింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్‌తో  ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ బ్యూటీకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది.  శృతి హాసన్  మొదట ప్లేబ్యాక్ సింగర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ముందుగా బాలీవుడ్ మూవీ ‘లక్‌’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో  ఈ అమ్మడు చేసిన ‘అనగనగా ఓ ధీరుడు’, ‘ఓమై ఫ్రెండ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి.  దీంతో శృతి హాసన్‌ను అందరు ఐరెన్‌లెగ్‌గా ముద్రవేసారు.  అలా ప్రారంభంలో కాస్త ఆటుపోట్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు.. ఎలాగైనా చిత్రపరిశ్రమలో రాణించాలనుకుంది. 2012లో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన  గబ్బర్ సింగ్ మూవీ సూపర్ హిట్ కావడంతో శృతి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా ఆమె కెరీర్‌కు టర్న్ చేసింది.

    నిన్న మొన్నటి వరకు నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ.. ఇపుడు రీ ఎంట్రీలో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ  భామ చేతిలో చాలానే సినిమాలున్నాయి. తాజాగాఈ భామ మేకప్ లేకుండా తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ల్ చేసింది. మేకప్ లేకున్న నాచురల్‌గా ఉన్న శృతి హాసన్ ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తూ అభిమానులను కనువిందు చేస్తోంది.



    ప్రస్తుతం శృతి హాసన్ హీరోయిన్‌గా రవితేజ్ సరసన క్రాక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 9న సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదల కానుంది. మరోవైపు శృతి హాసన్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తోంది. ఏదేమైనా టాలీవుడ్లో శృతి హాసన్ మళ్ళీ బిజీ కాబోతుండటంతో అమ్మడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా శృతి హాసన్ మరోసారి మాయ చేస్తుందా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: