Balakrishna - Gopichanda Malineni: గతేడాది చివర్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ‘అఖండ’ (Akhanda) మూవీ సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలకృష్ణ.. అదే ఉత్సాహంతో తన తదుపరి సినిమా షూటింగ్స్ చకచకా ఫినిష్ చేస్తున్నారు. అఖండ సక్సెస్ తర్వాత మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni)తో ఆయన కొత్త ప్రాజెక్టు సెట్స్ మీదకొచ్చింది. NBK 107 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య బాబు సెట్స్‌లో అడుగుపెట్టేసి అల్లరల్లరి చేసింది హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan). ఈ క్రమంలోనే ఆమె దిగిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
సెట్స్ పైకి వచ్చిన శృతి హాసన్‌తో దిగిన ఓ పిక్ షేర్ చేశారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. మోస్ట్ టాలెంటెడ్ అండ్ మై ఫేవరేట్ యాక్టర్ సెట్స్‌లో చేరిపోయిందంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన బాలయ్య బాబు ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు. దీంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ ఫొటోలో తెగ హుషారుగా కనిపించింది శృతి హాసన్.
ఒకానొక సమయంలో సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శృతి హాసన్.. ఆ తరువాత కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రియుడితో ప్రేమాయణం నడిపిస్తూ సినిమాలు బ్రేక్ చేసింది. అయితే తన లవ్ బ్రేకప్ కావడంతో మళ్లీ సినిమాల వంక చూస్తూ ఇటీవల రవితేజ సరసన క్రాక్ మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెటర్ చాయిస్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ బాలయ్య బాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవితో కూడా తెరపంచుకోనుండటం విశేషం.
Most talented n favourite @shrutihaasan on sets #NBK107???????????????????? pic.twitter.com/iSdmX4zrn9
— Gopichandh Malineni (@megopichand) June 18, 2022
ఇదిలాఉంటే.. బాలకృష్ణ- గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ఈ సినిమా కథ రాసుకున్నారట గోపీచంద్ మలినేని. ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదని సమాచారం. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలవాలని భావిస్తున్నారట. ఈ చిత్రానికి సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దీనికి జై బాలయ్య అనే పేరు ఖరారు చేశారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.