ప్రతిష్టాత్మక స్ట్రీమింగ్ సంస్థ తెలుగులో మొదటిసారిగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. పిట్టకథలు పేరుతో వస్తోన్న ఈ ఆంథాలజీలో మొత్తం నాలుగు కథలు ఉండనున్నాయి. తెలుగులో మొదటి సారి నెట్ ఫ్లిక్స్ ఇలాంటీ ప్రయత్నం చేస్తోంది. కరోనా కారణంగా ఓటీటీలు పుంజుకున్నాయి. జనాలు థియేటర్స్‌కు వెళ్ళడం తగ్గించారు. దీన్నే ఈ సంస్థలు అదునుగా భావించి కొత్త కొత్త కాంటెంట్‌ను ప్రోడ్యూస్ చేస్తూ ఆకట్టకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు.. ఈ సంస్థలు సొంతంగా కాంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్‌గా పిలుస్తున్నాము. ఈ ఒరిజనల్స్‌లో హిందీలో కియారా నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్‌లు చేస్తూ అటూ డిజిటల్లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతున్నారు. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది. అందులో భాగంగా తాజాగా ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తెలుగులో మొదటిసారిగా ఓ ఒరిజనల్ కంటెంట్‌ను ప్రోడ్యూస్ చేసింది.
ఈ వెబ్ ఫిల్మ్‌లో నాలుగు కథలను చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదలచేసింది నెట్‌ఫ్లిక్స్. పిట్టకథలు పేరుతో విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈ పిట్టకథలు అనే అంథాలజీలో మొత్తం నాలుగు కథలు ఉండనున్నాయి. ఈ కథలు కూడా మహిళలకు సంబంధించినవి ఉంటూ.. సమాజంలో ఉన్న పెట్రియార్కిను ప్రశ్నిస్తూ ఒక్కో కథలో ఒక్కో అంశాన్ని చర్చించనున్నారు.
ఇక తాజాగా విడుదలైన ఈ ట్రైలర్లో శృతి హాసన్, అమలాపాల్, ఈషారెబ్బా, లక్షీమంచులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్‌ను చూస్తుంటే ఘాటు సీన్లతో బాగానే మసాలా దట్టించినట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేసి తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. మరో ముఖ్య పాత్రను జగపతి బాబు పోషించాడు. ఇతర పాత్రల్లో ఆషిమా నర్వాల్, అభయ్ బేతగాని మొదలగు వారు నటించారు ఇక ఈ నాలుగు కథలను నలుగురు తెలుగు డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్, సంకల్ఫ్ రెడ్డి, నందినీ రెడ్డి, అండ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. చూడాలి మరి ఈ వెబ్ సిరీస్ తెలుగువారిని ఏవిధంగా ఆకట్టుకోనుందో... ఇక ఇలాంటిదే ఇటీవల తమిళ్లో కూడా ఓ అంథాలజీ వచ్చింది. పావ కథైగల్ అనే పేరుతో వచ్చిన ఆ వెబ్ సిరీస్ లో సాయి పల్లవి గర్భవతిగా నటించి అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. పాపులర్ తెలుగు నటి సమంత అమెజాన్ ప్రైమ్‌లో వస్తోన్న ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. లైవ్ టెలికాస్ట్ పేరుతో వస్తోన్న ఈ వెబ్ సిరీస్‌లో హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.