Home /News /movies /

SHRUTI HAASAN CRIMINAL CASE AGAINST SHRUTI HAASAN TO TRESPASSING INTO POLLING BOOTH BJP RAISE COMPLAINT TA

Shruti Haasan: చిక్కుల్లో శ్రుతి హాసన్.. క్రిమినల్ కేసు అవుతుందా.. ?

శృతిహాసన్.. Photo : Twitter

శృతిహాసన్.. Photo : Twitter

Shruti Haasan: ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే. సరిగ్గా హీరోయిన్ శృతి హాసన్ విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి వెళితే...

    Shruti Haasan: ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే. సరిగ్గా హీరోయిన్ శృతి హాసన్ విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి వెళితే... నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు హీరోయిన్స్ శృతి హాసన్, అక్షరా హాసన్ తన తండ్రితో కలిసి చెన్నైలో తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత శృతి హాసన్, తన తండ్రితో కలిసి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూతులోకి వెళ్లడం వివాదాస్పదమైంది.

    శృతి హాసన్‌.. తన తండ్రి పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేదు. పైగా ఆమె పోలింగ్ ఏజెంట్ కూడా కాదు. మీడియా పర్సన్ కూడా అంత కంటే కాదు. పైగా ఎన్నికలు జరుగుతున్న ప్రదేశంలో శృతి హాసన్‌ను ఎలా అనుమతించారని బీజేపీ వాళ్లు ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసారు. పైగా శృతి హాసన్ పోలింగ్ తర్వాత ఓటు వేసినట్టు చెప్పడమే కాదు.. తన ట్విట్టర్‌లో తన తండ్రి పార్టీ అయిన ‘మక్కల్ నీది మయ్యం’, MNM కు ఓటు వేయమని చెప్పడం కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్దమని కూడా బీజేపీ వాళ్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

    కోయంబత్తూరు ఎన్నికల కేంద్రంలో తండ్రి కమల్ హాసన్, శృతి హాసన్ (Twitter/Photo)


    అంతేకాదు ఎన్నికల ప్రవర్తన నియమావళికి భిన్నంగా పోలింగ్ బూతులోకి ప్రవేశించిన శృతిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షకుడు నందకుమార్‌తో పాటు బీజేపీ జాతీయ మహిళ నేత వానతి శ్రీనివాస్ కూడా శృతి హాసన్ పై జిల్లా ఎన్నికల అధికారికి   ఫిర్యాదు చేసారు.



    మరి శృతి పై ఎలక్షన్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. నిన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు  అసోంలో ఈ సారి మూడో విడతతో ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది. పశ్చిమ బంగలో మాత్రం మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటితో దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది. ఇక ఎన్నికల ఫలితాల కోసం మే 2 వరకు నిరీక్షించాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: 5 State Elections, Kamal haasan, Kollywood, Shruti haasan, Tamil Nadu Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు