shruthi hassan: బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్ చేసిన శృతి హాసన్.. ఏదైనా అడగండి అంటూ?

shruthi hassan

shruthi hassan: ఈ సంవత్సరంలో సూపర్ హిట్ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శృతి హాసన్. రవితేజతో క్రాక్ సినిమాలో నటించి తన నటనతో.. ఫైట్స్ తో అందరితో ఆహా అనిపించింది ఈ హీరోయిన్.

  • Share this:

    shruthi hassan: ఈ సంవత్సరంలో సూపర్ హిట్ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శృతి హాసన్. రవితేజతో క్రాక్ సినిమాలో నటించి తన నటనతో.. ఫైట్స్ తో అందరితో ఆహా అనిపించింది ఈ హీరోయిన్. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత నటించిన క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలోనూ చిన్న పాత్రలో కనిపించి అభిమానులను అలరించిన ఈ భామ అస్క్ టూ మీ అంటూ ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది.


    ఇందులో భాగంగా ఎవరు చూడని ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసారు.. ఆమె ఇష్టాఇష్టాలను అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో షేర్ చెయ్యని ఫోటో కానీ ఆమెకు ఎంతో ఇష్టమైన ఫోటోను షేర్ చెయ్యమంటే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.




    shruthi hassan
    shruthi hassan

    కాగా.. తనకు ఇష్టమైన సినిమా ది గాడ్‌ ఫాదర్‌, ఎటర్‌నల్‌ సన్‌షైన్‌ అని పంచుకున్న శృతి హాసన్.. తనకు దక్షణాది విందు భోజనం అంటే ఇష్టం అని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి ఆమెను అడగగా.. దాని గురించి అడిగితే చంపేస్తా అనే ఇమేజిని ఆమె పెట్టింది. ఇంకా ఆమె ఫోన్ లో 51,574 ఫొటోలు, 9373 వీడియోలు ఉన్నట్టు చెప్పిన ఆమె.. ఫెవరెట్ ఫోటో ఏంటి అంటే చిన్ననాటి సమయంలో ఆమె కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    Published by:Navya Reddy
    First published: