Shruthi Hassan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. ఈ మధ్య వార్తలో ఎక్కువ నిలుస్తుంది హాట్ బ్యూటీ. ఇక ముక్కు సూటి అమ్మాయిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది శృతిహాసన్. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో తెగ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే శృతిహాసన్ కు తన తండ్రి కమల్ హాసన్ అంటే ఎంతో ఇష్టమనే సంగతి మనకు తెలిసిందే. అంతే కాకుండా ఆయన తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది శృతి.
1980లో కమల్ హాసన్ మరో నటి సారిక ను పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి పెళ్లికి ముందు వీరిద్దరి మధ్య ప్రేమ విషయం అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం బాగా వైరల్ గా మారింది. ఇక తమ పెళ్ళి తర్వాత 1986లో శృతిహాసన్ జన్మించింది. ఇక కొన్నేళ్లపాటు తమ జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటూ సాగుతుండగా వీళ్ళు 2004లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు.
ఇప్పటికీ వాళ్ళు దూరంగానే ఉంటున్నా.. శృతిహాసన్ మాత్రం వాళ్ళకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుందట. ఇక తన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాతనే సంతోషంగా ఉన్నానంటుంది శృతి. వాళ్లు విడాకులు తీసుకుంటున్న సమయంలో తాను యంగ్ ఏజ్ లో ఉన్నాదట. వాళ్ళు భిన్న అభిప్రాయాలతో కలిసి బతకడం కంటే వాళ్ళు విడిపోవడమే కరెక్ట్ అని తెలిపింది. ఇప్పుడు తనకు తన నాన్నతో ఎంతో అనుబంధం ఉందంటూ.. తన అమ్మతో కూడా అంతే రిలేషన్ లో ఉన్నానంటూ తెలిపింది.
ఇక శృతిహాసన్ గత కొన్ని రోజులు సినిమాలకు దూరం గా ఉండగా మళ్లీ ఇండస్ట్రీకి దగ్గరయింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో హీరోయిన్ గా నటిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breakup, Childhood, Kamal hassan, Parents’ divorce, Sarika, Shruti haasan, Sister Akshara, Tollywood actress, Wonderful parents