Shriya Saran : బోల్డ్ పాత్రలో నటించనున్న సీనియర్ నటి శ్రియ..

Shriya Saran : హిందీలో ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అంధాధున్‌'. ఈ సినిమాను తెలుగులో నితిన్‌ రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 9, 2020, 7:18 AM IST
Shriya Saran : బోల్డ్ పాత్రలో నటించనున్న సీనియర్ నటి శ్రియ..
శ్రియా సరన్ Photo : Twitter
  • Share this:
హిందీ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో వచ్చి సూపర్ హిట్ అయిన అంధాధున్ సినిమాను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా ఉండే టబు పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తే బాగుంటదని ఆలోచిస్తోన్న చిత్రబృందం ఈ పాత్ర కోసం చాలా మందినే పరిశీలించింది. కొంత నెగెటివ్ టచ్, కొంత బోల్డ్‌‌గా ఉండే ఈ పాత్రను తెలుగులో కూడా ఆమె చేయనుందని కొన్ని రోజులు టాక్ నడిచింది. ఆ తరువాత ఆ పాత్ర యాంకర్ అనసూయకు దక్కిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులు రమ్యకృష్ణ అంటూ టాక్ నడిచింది. అయితే ఈ పాత్ర చేయాలంటే రమ్య కృష్ణ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోందట. దీంతో ఈ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాని కూడా పరిశీలించిందట చిత్రబృందం. అయితే ఆ పాత్రకి ఆమె సింపుల్‌గా నో చెప్పేసిందట. దీనికి కారణం లేకపోలేదు. ఇలియానా గతంలో నితిన్‌తో రెచ్చిపో అనే సినిమా చేసింది. అందుకే మళ్ళీ ఇప్పుడు నితిన్ తో నెగటివ్ క్యారెక్టర్ చేస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోతుందని భావించిఉండవచ్చని అంటున్నారు. ఇక అదే పాత్రకోసం మరో హిందీ నటి శిల్పాశెట్టిని సంప్రదించగా.. ఆమె కూడా బిజీ అని చెప్పి..‘నో’ చెప్పినట్లుగా టాక్.

దీంతో ఏం చేయాలో తెలియని చిత్రయూనిట్ కొంతకాలం పాటు ఈ చిత్రాన్ని వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ నడిచింది. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఆ కీలకపాత్ర కోసం అందాల నటి శ్రియను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈమే ఈ సినిమాలో నటించడం ఖాయం అయ్యిందట. ప్రస్తుతం ఆమె స్పెయిన్‌లో భర్తతో ఉంటోంది. సినిమా గురించి వివరించగా ఓకే అన్నారట. 'రంగ్‌ దే' చిత్రీకరణ పూర్తి చేశాక, ఈ రీమేక్‌ చిత్రీకరణ ప్రారంభించాలని నితిన్‌ సన్నాహాలు చేస్తున్నారట. నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన ఇస్టార్ట్ శంకర్‌తో సూపర్ పాపులర్ అయినా నభా నటేష్ నటిస్తుంది. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ఆయన.. ప్రస్తుతం కీర్తి జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తోన్న రంగ్ దే సినిమాతో నితిన్ పవర్ పేట అనే ఓ భారీ యాక్షన్ సినిమాలోను నటించనున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: September 9, 2020, 7:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading