సౌత్ యాక్టరస్ శ్రియ శరణ్ Shriya Saranమరోసారి తన ఎంజాయ్మెంట్కి సంబంధించిన వీడియో(Video)ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. భర్త ఆండ్రీ కొస్చీవ్andrei koscheev, కూతురు రాధ(Radha)తో కలిసి గోవా (Goa)సముద్ర తీరంలో నీటి అలలతో బీచ్ డ్రెస్(Beach dress)లో తెగ సందడి చేసింది. పర్సనల్ లైఫ్‌ని మ్యాక్సిమమ్ ఎంజాయ్ చేసే శ్రియ ఎప్పుడూ సోషల్ మీడియా(Social media)లో యాక్టివ్‌గా ఉంటుంది. తన లైఫ్ స్టైల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. గతంలో కూడా స్విమ్మింగ్ ఫూల్లో భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను నెటిజన్లతో పంచుకున్న శ్రియ మరోసారి అలాంటి థ్రిల్లింగ్ వీడియోని (Instaఇన్‌స్టా)లో పోస్ట్ చేసింది.
బీచ్‌లో కేరింతలు..
ఇష్టం అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా పరిచయమైన సౌత్ యాక్టరస్ శ్రియ శరణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే ..మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. వివాహం జరిగిన తర్వాత, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా వచ్చిన ఆఫర్లను వదులుకోకుండా సినిమాలు చేస్తూ వస్తోంది శ్రియ. రీసెంట్గా రాజమౌళి ట్రిపులార్ సినిమాలో కూడా అజయ్‌దేవగన్‌కి జోడిగా నటించి మెప్పించింది. ట్రెడిషనల్, మోడ్రన్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఇంట్లో భర్త, కూతురుతో చేసే సందడి వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం షేర్ చేస్తుంది శ్రియ.
View this post on Instagram
ఎంజాయ్మెంట్లో తగ్గేదేలే..
గోవా బీచ్‌లో కూతురిని భర్త, తను ఆడిస్తున్న వీడియోని శ్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో శ్రియ శరీర అందాలు చూపిస్తూనే జాలీగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను వీడియోలో బంధించింది. కొన్ని గంటల క్రితమే షేర్ చేసిన ఈవీడియోకి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇక శ్రియ ఫ్యామిలీని, ఆమె అందాలను వర్ణిస్తూ నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
శ్రియ అందాల ఆరబోత..
ఇరవై ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అఢుగుపెట్టిన శ్రియ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో యాక్ట్ చేసిన సౌత్ బ్యూటీ ఇప్పటికి తన కెరీర్‌ను కొనసాగిస్తుండటం గ్రేట్ అనే చెప్పాలి. కెరీర్ ఆరంభంలో చేసిన ప్రతీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వరుస ఆఫర్లను దక్కించుకుంది. తమిళంలోనూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మూడు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Shriya Saran, Tollywood actress, Viral Video