అల్లు అర్జున్‌కు అంట్లు తోమే ఛాలెంజ్ ఇచ్చిన హీరోయిన్..

అల్లు అర్జున్ (File/Photo)

Allu Arjun: అల్లు అర్జున్ ఏంటి.. అంట్లు తోమడం ఏంటి అనుకుంటున్నారా..? ఏం చేస్తాం.. ఈ రోజుల్లో అమ్మాయిలు తక్కువేం కాదు..

  • Share this:
అల్లు అర్జున్ ఏంటి.. అంట్లు తోమడం ఏంటి అనుకుంటున్నారా..? ఏం చేస్తాం.. ఈ రోజుల్లో అమ్మాయిలు తక్కువేం కాదు.. అబ్బాయిలతోనే అన్ని పనులు చేయిస్తున్నారంటూ ఇప్పటికే మంచి మీమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తున్నారు కొందరు హీరోయిన్లు. తాము కట్టుకున్న భర్తలతోనే ఇంటి పనులు కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ కూడా ఇదే చేసింది. లాక్ డౌన్ వేళ ఇంట్లోనే ఉండాల్సి రావడంతో తన భర్తతోనే అన్ని ఇంటి పనులు చేయిస్తుంది ఈమె. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈమె. రెండేళ్ల కింద తను ప్రేమించిన రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్ర్యూ కొస్చివ్‌ను పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత కొన్ని రోజులు ఇండియాలో.. మరికొన్ని రోజులు అత్తగారి దేశంలో ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న ఈమె.. పెళ్లైన మగాళ్లందరికీ సవాల్ విసిరింది. అందులో అల్లు అర్జున్, ఆర్య కూడా ఉన్నారు. ఇంట్లో ఎవరెవరు తమ భార్యలకు ఇంటి పనుల్లో సాయం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తుంది. తన ఇంట్లో అయితే భర్త ఆండ్ర్యూ గిన్నెలు తోముతున్నాడంటూ వీడియో పోస్ట్ చేసింది. దాంతో పాటే లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. మరి మీ ఇళ్లలో ఎవరెవరు ఇలాంటి పని చేస్తున్నారు అంటూ అందరికీ సవాల్ విసురుతుంది శ్రీయ. ఇంట్లో పనులు చేసే ఛాలెంజ్ కూడా మొదలుపెట్టింది శ్రీయ. మరి ఈమె ఛాలెంజ్ ఏయే భర్త తీసుకుంటాడో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: