శ్రేయ ఘోషల్ గొంతులో 'మెయిన్ తెరి నజర్‌కా సరూర్ హున్'.. వినాల్సిందే..

Shreya Ghoshal : శ్రేయ ఘోషల్.. ఓ అద్బుత గాయని. తన గొంతుతో యావత్ భారతవనిని తనవైపు తిప్పుకోగలదు.

news18-telugu
Updated: October 28, 2019, 12:01 PM IST
శ్రేయ ఘోషల్ గొంతులో 'మెయిన్ తెరి నజర్‌కా సరూర్ హున్'.. వినాల్సిందే..
Instagram/shreyaghoshal/
  • Share this:
Shreya Ghoshal : శ్రేయ ఘోషల్.. ఓ అద్బుత గాయని. తన గొంతుతో యావత్ భారతవనిని తనవైపు తిప్పుకోగలదు ఈ బెంగాలీ భామ. శ్రేయ ఆమె హిందీలోనే కాకుండా.. తెలుగు, తమిళంతో పాటు ఇతర సౌత్ ఇండియా భాషాల్లో కూడా ఎన్నో మంచి పాటలు పాడింది. శ్రేయ తెలుగులో 'ఒక్కడు' సినిమాకు మొదటగా పాడింది. ఆ సినిమాలో "నువ్వేం మాయ చేసావో గాని " అంటూ ఆమె పాడిన ఆ పాట.. ఎంత పాపులరో తెలిసిందే. ఆ ఒక్క చిత్రంలోనే కాకుండా ఆమె తెలుగులో చాలా సినిమాల్లో పాడారు శ్రేయా.. పాడుతూనే ఉన్నారు.


View this post on Instagram

Hindi Telugu Kannada Tamil. Today’s menu:)


A post shared by shreyaghoshal (@shreyaghoshal) on

శ్రేయ ఘోషల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్‌లో జన్మించారు. ఆమె తండ్రి బిశ్వజీత్ ఘోషాల్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీరుగా పని చేసేవారు. తల్లి లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యూయేట్. శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ సినిమా 'దేవదాస్'‌తో  ప్రారంభించారు. మొదటి చిత్రమే ఆమెకు జాతీయ అవార్డ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికి శ్రేయకు 4 జాతీయ పురస్కారాలు, 9 ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌లను గెలుచుకుంది. అది అలా ఉంటే శ్రేయా తాజాగా  హిందీకి చెందిన ఓ పాత పాట 'మెయిన్ తెరి నజర్‌కా సరూర్ హున్' ను పాడి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పాటను విన్న నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా విపరీతంగా కామెంట్స్ పెడుతూ.. ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. శ్రేయ ఘోషల్ హాట్ పిక్స్..
Published by: Suresh Rachamalla
First published: October 28, 2019, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading