బాలయ్య సరసన చిరంజీవి భామ.. ఫిక్సైన చిత్రబృందం..

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: March 25, 2020, 6:30 PM IST
బాలయ్య సరసన చిరంజీవి భామ.. ఫిక్సైన చిత్రబృందం..
బాలయ్య Photo : Twitter
  • Share this:
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ’ ఆ తర్వాత ‘లెజెండ్’ మంచి విజయాన్ని పొందాయి. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి నటిస్తోంది. అంజలి తెలుగులో 2013లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో అమాయకంగా కనిపిస్తూ.. ఆ సినిమాలో ఈ భామ చేసిన యాక్టింగ్‌కు తెలుగువారందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుసగా.. 'బలుపు' 'గీతాంజలి', 'చిత్రంగద' వంటి సినిమాలలో నటించింది. అంజలి గతంలో బాలయ్యతో కలిసి ‘డిక్టేటర్‌’ చిత్రంలో ఆడిపాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌‌కు అవకాశం ఉండగా.. ఈ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించి చివరకు శ్రియను ఎంచుకుంది చిత్రబృందం. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఈ సినిమాలో బాలయ్య లుక్ మారనుందని సమాచారం. విలన్‌గా నటుడు శ్రీకాంత్  చేస్తున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందించనున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: March 25, 2020, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading