news18-telugu
Updated: October 28, 2020, 7:50 PM IST
శ్రీదేవి నగీనా రీమేక్‌లో శ్రద్ధా కపూర్ (File/Photo)
Shraddha Kapoor-Sridevi | అతిలోక సుందరి బాలీవుడ్లో నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ‘నగినా’ సినిమా ఒకటి. హర్మేష్ మల్హోత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. 1986లో విడుదలైన ఈ సినిమాలో రిషీ కపూర్ హీరోగా నటించారు. అమ్రిష్ పురి మాంత్రికుడి పాత్రలో మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘నిగాహే’ సినిమా తెరకెక్కింది. కానీ ఈ సీక్వెల్ మాత్రం అనుకున్నంత రేంజ్లో నడవలేదు. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమాలో నాగినిగా శ్రీదేవి నటన అపూర్వం అనే చెప్పాలి. ఆ పాత్రలో శ్రీదేవి నటించింది అనే కంటే జీవించందనే చెప్పాలి. ఈ సినిమాలో మై తేరి దుష్మన్ అంటూ లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ సంగీతానికి లతా మంగేష్కర్ పాడిన పాట ఎంతో పాపులర్ అయింది. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమాకు ఇపుడు బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారు. హిందీ రీమేక్‌లో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించనుంది. ఆ విషయాన్ని శ్రద్ధా కపూర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. అలనాటి శ్రీదేవి నటించిన ‘నాగిన్’, ‘నిగాహే’ సినిమాలు చూసి పెరిగిన నేను ఇపుడు అలాంటి పాత్రలో నటించాలనేది తన కోరిక. ఇపుడు ఈ ‘నగినా’ రీమేక్‌తో నా కోరిక తీరబోతుందంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను విశాల్ ఫురియా డైరెక్ట్ చేయనున్నారు. నిఖిల్ ద్వివేది ప్రొడ్యూస్ చేయనున్నారు.

శ్రీదేవి నగీనా రీమేక్‌లో శ్రద్ధా కపూర్ (File/Photo)
మొత్తంగా మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ నగినాగా ఎలా అలరిస్తుందో చూడాలి. ఈ యేడాది శ్రద్ధా కపూర్.. స్ట్రీట్ డాన్సర్ సినిమాతో పాటు బాఘీ 3 సినిమాలతో పలకరించింది. ఈ సినిమాలు ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసాయి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 28, 2020, 7:50 PM IST