తెలుగులో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతుంది సమంత. రీసెంట్‌గా తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమాతో మరో సారి తానేంటో ప్రూవ్ చేసుకుంది సామ్. ఈ సినిమాలో సమంత నటనను అందరు పొగుడుతున్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డుతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్న సమంత యాక్టింగ్‌పై కామెంట్స్ చేసి అడ్డంగా బుక్ అయింది జెర్సీ భామ శ్రద్ధా శ్రీనాథ్. వివారాల్లోకి వెళితే..గతేడాది సమంత..తెలుగు,తమిళంలో ‘యూటర్న్’ సినిమాను రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీని మాతృక కన్నడలో శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. అదే పాత్రను సమంత రెండు భాషల్లో చేసింది. తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మీరు నటించిన ‘యూటర్న్’ రీమేక్‌లో సమంత ఎలా నటించింది అనే దానికి..నేను ఆ సినిమాను చూసాను. అరగంట సేపు కూడా నేను ఈ సినిమాలో సమంత నటనను చూడలేకపోయాను. ఎందుకంటే నేను చేసిన పాత్రలో ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నానని సమాధానమిచ్చింది.
దీంతో సదరు సమంత అభిమానులు శ్రద్ద శ్రీనాథ్ చేసిన కామెంట్స్‌పై మండిపడుతున్నారు. తెలుగులో ఏమాత్రం అనుభవం లేని శ్రద్ద..సీనియర్ హీరోయినైనా సమంతపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు సమంత ఫ్యాన్స్. ఈ భామ..నాని హీరోగా నటించిన ‘జెర్సీ’సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయబోతుంది. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.