ఆర్ఆర్ఆర్(RRR) సక్సెస్ తర్వాత.. రాజమౌళి (Rajamouli) నెక్ట్స్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. మహేష్ బాబుతో (Mahesh Babu) రాజమౌళి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు...వీరిద్దరి కాంబినేషన్ లో అతి త్వరలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఇటు రాజమౌళి అభిమానులతో పాటు.. అటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఎంతో భారీ స్థాయిలో ఇండియన్ ఫిలిం హిస్టరీ లో నిలిచిపోయే విధంగా భారీ ఎత్తున ఈ మూవీని నిర్మించనున్నట్లు టాక్.
అయితే మహేష్ సినిమా కోసం ప్రముఖ హీరోయిన్ పేరు ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం గట్టిగా ఉందని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ప్రభాస్ తో సాహో మూవీ చేసి మంచి క్రేజ్ దక్కించుకున్న శ్రద్ధ, స్వతహాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ కావడం విశేషం. మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఏంటో ప్రాధాన్యత ఉంటుంది. దీంతో అలాంటి పాత్రకు శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) అయితేనే కరెక్ట్ అని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్‌గా ఇంకా ఎలాంటి వార్త బయటకు రాలేదు.
సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే భారీ అడ్వెంచరస్ డ్రామా మూవీగా ఇది తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాంటి స్టోరీపై తాము కసరత్తు చేస్తున్నట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు ఇటీవల హాలిడే ట్రిప్ నుండి తిరిగివచ్చిన రాజమౌళి ప్రస్తుతం తండ్రితో కలిసి వరుసగా స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారని, అతి త్వరలో స్టోరీ ఫైనలైజ్ కానుంది. ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చెప్తున్నారు. అయితే మహేష్ రాజమౌళి కాంబినేషన్‌లో ఎన్నో ఏళ్ళ క్రితమే ఈ మూవీ రావాల్సింది. అయితే కొన్ని కారణాల వలన అది కార్యరూపం దాల్చలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Rajamouli, Shradda kapoor, Shraddha Kapoor