Saaho: సాహోను భారీగా క్యాష్ చేసుకున్న శ్రద్ధా కపూర్... ఎంతో తెలుసా...

Shraddha Kapoor | బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిన ప్రభాస్ తదుపరి సినిమాలో నటించే ఛాన్స్ శ్రద్ధా కపూర్‌కు దక్కింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు శ్రద్ధా కపూర్‌కు భారీగానే పారితోషకం ముట్టిందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: July 30, 2019, 9:51 PM IST
Saaho: సాహోను భారీగా క్యాష్ చేసుకున్న శ్రద్ధా కపూర్... ఎంతో తెలుసా...
శ్రద్ధా కపూర్
  • Share this:
బాలీవుడ్ భామలు టాలీవుడ్ స్టార్స్ నటించేందుకు అంత ఈజీగా ఒప్పుకోరు. ఇందుకోసం ఎన్నో డిమాండ్లు పెడుతుంటారు. ఇందులో రెమ్యూనరేషన్ విషయం చాలా ముఖ్యమైనది. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిన ప్రభాస్ తదుపరి సినిమాలో నటించే ఛాన్స్ శ్రద్ధా కపూర్‌కు దక్కింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు శ్రద్ధా కపూర్‌కు భారీగానే పారితోషకం ముట్టిందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు శ్రద్ధా కపూర్ తీసుకునే రెమ్యూనరేషన్ రూ. 3 నుంచి రూ. 4 కోట్లు మాత్రమే ఉంటుంది. ఎక్కువగా కుర్ర హీరోలు, అప్ కమింగ్ హీరోల సరసన మాత్రమే నటించే అవకాశాలు దక్కించుకునే శ్రద్ధా కపూర్‌... సాహో సినిమాకు పెద్ద ఎత్తున డేట్స్ ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఆమెకు ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చిందని సమాచారం.

అయితే ఇందుకోసం శ్రద్ధా కపూర్‌కు బాలీవుడ్‌తో పోలిస్తే బాగానే పారితోషకం ఇచ్చారని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ సహా పలు ఇతర భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ఏకంగా రూ. 7 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందని టాక్. అంతేకాదు... ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్‌లోనూ తన రేంజ్ పెరుగుతుందని ముద్దుగుమ్మ ఆశగా ఎదురుచూస్తోంది. మొత్తానికి సాహో సినిమాలో నటించినందుకు బాలీవుడ్ భామకు బాగానే డబ్బులు ముట్టినట్టు అర్థమవుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: July 30, 2019, 8:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading