హోమ్ /వార్తలు /సినిమా /

Shraddha Kapoor : మాల్దీవుల్లో మరో ముద్దుగుమ్మ.. సముద్ర గర్భంలో జలకన్యలా అదరగొట్టిన శ్రద్ధా..

Shraddha Kapoor : మాల్దీవుల్లో మరో ముద్దుగుమ్మ.. సముద్ర గర్భంలో జలకన్యలా అదరగొట్టిన శ్రద్ధా..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా క‌పూర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ అమ్మ‌డు త‌న సినిమా విష‌యాల‌తో పాటు వివిధ యాక్టివిటీస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా క‌పూర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ అమ్మ‌డు త‌న సినిమా విష‌యాల‌తో పాటు వివిధ యాక్టివిటీస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నటి శ్రద్ధా కపూర్‌. పేరుకు తండ్రి వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుందీ చిన్నది. 2010లో ‘తీన్‌పత్తి’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.రీసెంట్‌గా ఈ అమ్మ‌డు త‌న తండ్రి.. నటుడు శక్తి కపూర్ .. తల్లి శివంగి పురే తనతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లింది. అక్క‌డ స్కూబా డైవ్ చేసి అంద‌కు సంబంధించిన వీడియో షేర్ చేసింది. సముద్ర గర్భంలో జలరాశులతో పోటీ పడుతూ స్విమ్‌ చేసిందీ చిన్నది. ఇక నీటిలో ఈత కొడుతోన్న శ్రద్ధాను చూస్తుంటే జలకన్యలా కనిపిస్తోంది. ఇక ఈ వీడియోతోపాటు "సముద్ర గర్భంలో జీవితం" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది.

నీటి అడుగున తీసిన‌ వీడియో క్లిప్ లో అనేక జలరాశులు కనిపిస్తున్నాయి. అలానే కొన్ని డాల్ఫిన్ లు శ్రద్ధాతో ఆడుకుంటున్న‌ట్టుగా ఉంది. ఈ వీడియో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మ‌డు రోహన్ శ్రేష్ఠ అనే వ్య‌క్తితో త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని తెలుస్తుంది.అనతి కాలంలో బాలీవుడ్‌లో ప్రముఖ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ‘ఆషికీ-2’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది భారీగా అభిమానులను సంపాదించుకుంది.


ఇక తెలుగులో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం మెస్మరైజ్‌ చేసింది. ఇక సినిమాలతో నిత్యం బిజీగా గడిపే చిన్నది సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇక శ్రద్ధా కపూర్‌ సినిమాల విషయానికొస్తే.. ముద్దుగుమ్మ చివరిగా స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ, బాఘి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

First published:

Tags: Bollywood heroine, Shradda kapoor

ఉత్తమ కథలు